Advertisementt

చిట్టిబాబు ఓవర్సీస్ ఆట మొదలైంది..!

Mon 02nd Apr 2018 09:50 PM
ram charan,rangasthalam,2 million,overseas  చిట్టిబాబు ఓవర్సీస్ ఆట మొదలైంది..!
Rangasthalam Crossed 2 Million In Overseas చిట్టిబాబు ఓవర్సీస్ ఆట మొదలైంది..!
Advertisement
Ads by CJ

రంగస్థలం ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్ట్ చేస్తూ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ వెళ్ళిపోతుంది. ప్రతి షో హౌస్ ఫుల్ అవడంతో ఎగ్జిబిటర్ల ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 5 దాకా ఉదయం పూట ఒక షో వేసుకోవడానికి అధికారికంగా అనుమతి ఇవ్వడం ఎగ్జిబిటర్లకు వరంగా మారింది.

ఇక ఓవర్సీస్ లో తొలిసారి తమ మెగా పవర్ చూపిస్తున్నాడు రామ్ చరణ్. జనతా గ్యారేజ్ సినిమా ఫుల్ రన్ ను రామ్ చరణ్ కేవలం 2 రోజుల్లో అధిగమించడం చూసి అక్కడి డిస్ట్రిబ్యూటర్లు సైతం నోరెళ్ళ బెడుతున్నారు. జనతా గ్యారేజ్ ఫుల్ రన్ లో 1.8 మిలియన్ డాలర్లు రాబడితే ప్రీమియర్లతో కలిపి...రంగస్థలంతో చిట్టి బాబు కేవలం 2 రోజుల్లో 1.9 మిలియన్ డాలర్లు రాబట్టి సాలిడ్ స్ట్రాంగ్ గా దూసుకుపోతున్నాడు. చరణ్ ధృవ సినిమా ఫుల్ రన్ లో 1.47 మిలయన్ డాలర్ మూవీగా ఉంది. ఇప్పుడు తన రికార్డుతో పాటు ఎన్టీఆర్ రికార్డుని కూడా తుడిపేశాడు.

ప్రస్తుతం రామ్ చరణ్ నాన్నకు ప్రేమతో(2.02 మిలియన్ డాలర్లు)- అజ్ఞాతవాసి(2.07 మిలియన్ డాలర్లు). రేపో మాపో ఈ రికార్డ్స్ ని కూడా బీట్ చేయనున్నాడు చిట్టిబాబు. తన తండ్రి సినిమా ఖైదీ నెంబర్ 150ని టార్గెట్ చేశాడు చరణ్. ఈ చిట్టి బాబు ఇంకెన్ని రికార్డ్స్ ను క్రియేట్ చేస్తాడో చూద్దాం.

Rangasthalam Crossed 2 Million In Overseas:

Rangasthalam Creates Records in Overseas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ