Advertisementt

ఖుషీ..ఖుషీగా చైతూ, సామ్..!

Mon 02nd Apr 2018 09:12 PM
samantha akkineni,naga chaitanya,new york,enjoy mood  ఖుషీ..ఖుషీగా చైతూ, సామ్..!
Samantha Akkineni and Naga Chaitanya in Enjoy Mood ఖుషీ..ఖుషీగా చైతూ, సామ్..!
Advertisement
Ads by CJ

అక్టోబర్‌లో పెళ్లి తర్వాత మరలా నాగచైతన్య, సమంతలు సినిమాలతో బిజీ అయ్యారు. ఏదో హనీమూన్‌ని అర్జంట్‌గా జరుపుకుని నాగచైతన్య 'యుద్దం శరణం', 'సవ్యసాచి', 'శైలజారెడ్డి అల్లుడు' తో బిజీ అయ్యాడు. ఇక సమంత 'రాజు గారి గది2, రంగస్థలం' లతో పాటు 'మహానటి', విశాల్‌ 'అభిమన్యుడు'తో పాటు 'యూటర్న్‌' రీమేక్‌లో బిజీ అయింది. దాంతో ఈ జంటకాస్త షూటింగ్‌లకు బ్రేక్‌ తీసుకుని విదేశాలలో విహారం చేస్తోంది. ఈ ఇద్దరు తాము విదేశాలలో హ్యాపీగా గడుపుతున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అభిమానులను ఆనందింపజేస్తున్నారు. ఇక వీరిద్దరు కలిసి మొదటి సారిగా గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో 'ఏ మాయ చేసావే' చిత్రంలో నటించారు. 2010లో విడుదలైన ఈ చిత్రంలోని కొన్ని సీన్స్‌ని అమెరికాలోని న్యూయార్క్‌ సెంట్రల్‌ పార్క్‌లో కొన్ని సీన్స్‌ తీశారు. ఇదే ప్రదేశంలో సమంత, నాగచైతన్య ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. 

తాజాగా ఎనమిదేళ్ల తర్వాత ఈ జంట మరలా న్యూయార్క్‌కి వెళ్లి సెంట్రల్‌ పార్క్‌ వద్ద తమ మధురానుభూతులను పంచుకుంటూ సెల్ఫీ దిగి పోస్ట్‌ చేశారు. ఈ సెల్ఫీని ఉద్దేశించి సమంత మాట్లాడుతూ, నిజానికి నాకు సెల్ఫీలంటే ఇష్టం ఉండదు. కానీ ఈ సెల్ఫీ మాత్రం నాకు చాలా స్పెషల్‌. అందుకే ఈ సెల్ఫీని దీనికి మినహాయింపుగా చెప్పుకుంటున్నాను. అంటూ ఆ ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాను. తమ మధ్య ప్రేమ ఇక్కడే చిగురించిందని, ఆ మ్యాజిక్‌కి థ్యాంక్స్‌ అంటూ పేర్కొంది. ఇక ఇదే ఫొటోను నాగచైతన్య కూడా తన అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. ఇలా ఎనిమిదేళ్ల పాత స్మృతులను నెమరువేసుకుంటూ ఈ జంట తాజాగా ఆ అనుభూతులను మరలా పొందుతోంది. ఇక వీరు ఈ వెకేషన్స్‌ నుంచి తిరిగిరాగానే ఎవరి సినిమాలలో వారు బిజీ అవుతారు. అప్పటిదాకా ఆ జంట ఆకాశమే హద్దుగా ఎంజాయ్‌ చేస్తోంది.

Samantha Akkineni and Naga Chaitanya in Enjoy Mood:

Samantha Akkineni and Naga Chaitanya relive their Ye Maaya Chesave days in New York.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ