'రంగస్థలం' చిత్రంలో రామ్‌చరణ్, సమంత, జగపతిబాబు, ఆది పినిశెట్టి, అనసూయ.. ఇలా ఇందులో నటించిన వారందరి నుంచి దర్శకుడు సుకుమార్ పూర్తి టాలెంట్‌ని ఆవిష్కరించాడనే చెప్పాలి. అందువల్లే ఈ చిత్రం మూడు గంటలకు పైగా నిడివి ఉన్నప్పటికీ, సెకండాఫ్‌లో కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయనే విమర్శలను కూడా పక్కన పెట్టిన ఈ చిత్రం 100కోట్ల క్లబ్‌కి రెడీ అవుతోంది. ఇక ఈ చిత్రంలో రామ్‌చరణ్, సమంత, జగపతిబాబులు జీవించగా, అనసూయ, ఆది పినిశెట్టి వంటి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. కానీ అలా పాత్రకు న్యాయం చేయడం గొప్పే అయినా వారు పూర్తిగా జీవించారని చెప్పలేం. కానీ రంగమ్మత్తగా నటించిన అనసూయ మాత్రం తన డప్పు తానే కొట్టుకుంటోంది. ఏకంగా ఆమె తనని, తన పాత్రని 'బాహుబలి'లోని రమ్యకృష్ణ నటించిన 'శివగామి' పాత్రతో పోల్చుకుంటోంది. అనసూయ మాట్లాడుతూ, 'బాహుబలి'లో శివగామి పాత్రలో రమ్యకృష్ణని తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేమని, అలాగే 'రంగస్థలం' చిత్రంలో తన పాత్రను కూడా ఎవ్వరూ ఊహించుకోలేరని అంటూ ఈ మాటలు తన మాటలుగా కాకుండా అభిమానుల మాటలుగా చెప్పుకొచ్చింది.
ఇక ఈ 'రంగస్థలం'లో ఉన్న ఒదుగుతనం నాలో ఉంది. అందుకే ఆ పాత్రలో అంతగా ఒదిగిపోయాను. అద్భుతంగా ఈ చిత్రాన్ని తీసిన సుకుమార్‌కి, ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు రుణపడి ఉంటానని చెప్పుకొచ్చింది. ఇలా తనని తాను శివగామితో పోల్చుకోవడంతో పాటు ఈమె తన ఒదిగేతనం గురించి చెబుతున్న మాటలపై సెటైర్లు అయితే బాగానే పేలుతున్నాయి. ఇక ఈ చిత్రం విషయంలో 80శాతం థియేటర్లలో విడుదల చేసే అవకాశం ఉన్నప్పటికీ తక్కువ స్క్రీన్లలో, అది కూడా బలమైన సెంటర్లలో రిలీజ్ చేయడం, ఏపీలో ఈ చిత్రానికి ఇచ్చిన ఐదు షోల మినహాయింపు వంటివి ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ అవుతున్నాయి. ఈ విషయంలో పవన్‌కళ్యాణ్, అల్లుఅరవింద్‌ల వ్యూహం ఫలించిందని అంటున్నారు. ఇక ఇప్పటికే పవన్ తన టీం పికె క్రియేటివ్ వర్క్స్ మీద ఈ చిత్రంపై, ఇందులోని రామ్‌చరణ్ నటనపై ప్రశంసలు కురిపించగా, అల్లుశిరీష్, వరుణ్‌తేజ్‌లు ఆనందంతో ట్వీట్స్ చేస్తున్నారు. కానీ ఎవ్వరూ రంగమ్మత్తను మాత్రం పట్టించుకోక పోవడంతో ఆమెకి ఆమె తన పబ్లిసిటీ తాను ఇచ్చుకుంటోంది.