జగపతిబాబు 'లెజెండ్' తర్వాత మరోసారి 'రంగస్థలం'లో అదరగొట్టాడు. ఇక శ్రీకాంత్ 'యుద్దం శరణం'లో విలన్‌గా నటించినా సినిమా బాగా ఆడకపోవడంతో పేరు రాలేదు. అయినా రాబోయే రోజుల్లో శ్రీకాంత్‌కి ఒక్క పవర్‌ఫుల్ విలన్ పాత్ర పడితే మరలా విజృంభిస్తాడు. ఎందుకంటే ఆయన కెరీర్ స్టార్టింగ్‌లో యంగ్ విలన్‌గా ఎన్నో చిత్రాలలో నటించాడు. ఇక సుమన్‌కి రజనీకాంత్, శంకర్‌ల 'శివాజీ' చిత్రంలో నటించే అవకాశం వచ్చి, ఆ పాత్రకి మంచి పేరు వచ్చినా దానిని సుమన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇక ఇటీవల కాలంలో నాటి యాంగ్రీ యంగ్‌మేన్‌గా, నేడు యాంగ్రీమ్యాన్‌గా వయసు మీద పడిన రాజశేఖర్ కూడా విలన్ పాత్రలు వస్తే బాగుంటే చేయడానికి తాను రెడీ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఈయన గానీ రంగంలోకి దిగితే జగపతిబాబు వంటి వారికి పోటీ ఇవ్వడం ఖాయం. శ్రీహరి కూడా పాపం అకాల మరణం వల్ల కొన్ని పాత్రలు మిస్ అయ్యాడు. అలాంటి వాటికి రాజశేఖర్ ఆల్టర్‌నేటివ్‌గా మారే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం 'బాహుబలి' రెండు పార్ట్‌ల తర్వాత రాజమౌళి తీసే చిత్రం విషయంలో నానా రకాల వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ చిత్రం గురించి చిన్న విషయం బయటికి వచ్చినా అది వాస్తవమో కాదో కూడా తెలుసుకోకుండా ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.
ఇక ఇంత కాలం కేవలం గాసిప్స్‌కే పరిమితమైన ఈ విషయాన్ని ఆర్.ఆర్.ఆర్ పేరుతో రాజమౌళి, డివివి దానయ్యలు రివీల్ చేశారు. ఆర్ అనే సెంటిమెంట్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ని కూడా రామారావుగా మార్చారు. ఇక ఇందులో ప్రధానమైన పవర్‌ఫుల్ విలన్ పాత్రను రాజశేఖర్ చేయడానికి ఒప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. అందులోనూ రాజశేఖర్ పెద్ద కుమార్తె శివానీ తెరంగేట్రం చేస్తోన్న 'టూ స్టేట్స్' చిత్రం ఓపెనింగ్‌కి ముఖ్య అతిధిగా రాజమౌళి వచ్చాడు. దాంతోనే ఈ రకమైన ప్రచారం జరుగుతోందని, ఇప్పటివరకు రాజమౌళి ఈ చిత్రంలో విలన్‌గా నటించమని రాజశేఖర్‌ని కోరలేదని రాజశేఖర్ శ్రీమతి జీవితా తెలిపింది. దాంతో ఈ చిత్రం కోసం 'ఆర్' సెంటిమెంట్లను రాజమౌళి పాటిస్తున్నాడనే వార్తతో పాటు రాజశేఖర్ విలన్‌గా చేయడం లేదని తెలిసిపోయింది. అయితే ఇంకా రాజమౌళి రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లను తప్ప మరొకరిని ఇంకా సెట్ చేయలేదు. బహుశా రాజమౌళి అప్రోచ్ అయితే మాత్రం రాజశేఖర్ ఓకే చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రాజమౌళి చిత్రాలలో హీరోల తర్వాత అంత పేరు వచ్చేది విలన్లకే అన్న సంగతి తెలిసిందే.