Advertisementt

మంచి అవకాశం మిస్‌ చేసుకున్న నితిన్‌..!

Sun 01st Apr 2018 02:11 PM
nithiin,kamal haasan,vikram  మంచి అవకాశం మిస్‌ చేసుకున్న నితిన్‌..!
Nithiin Rejects That Crazy Offer మంచి అవకాశం మిస్‌ చేసుకున్న నితిన్‌..!
Advertisement
Ads by CJ

నితిన్‌ కి అనుకోని అదృష్టం వరించింది.  ఇప్పటి వరకు టాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న ఆయనకు కోలీవుడ్‌కి కూడా మంచిపాత్ర, మంచి సంస్థ ద్వారా పరిచయం అయ్యే అవకాశం లభించింది. కానీ ఆయన తాను బిజీగా ఉన్నానని అంత మంచి చిత్రాన్ని వదులుకున్నాడని వార్తలు వచ్చాయి.ప్రస్తుతం కమల్‌హాసన్‌ తన రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ బేనర్‌పై చియాన్‌ విక్రమ్‌ హీరోగా రాజేష్‌ సెల్వ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో నితిన్‌కి విక్రమ్‌తో సరిసమానమైన ప్రాధాన్యం కలిగిన పాత్ర లభించిందట. ఓ విధంగా చెప్పాలంటే విక్రమ్‌తో పాటు నితిన్‌ కూడా ఆ చిత్రంలో హీరోనే. అయితే ఈ వార్తలు బయటికి వచ్చినప్పుడు వీటిని అందరూ గాసిప్స్‌గా భావించారు. నితిన్‌కి అంత సీన్‌లేదని కొట్టిపారేశారు. కానీ తాజాగా నితిన్‌ 'చల్‌ మోహన రంగ' చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రంలో ఆఫర్‌వచ్చిన మాట నిజమేనని తెలిపాడు.

ఈ చిత్రంలో విక్రమ్‌కి సరిసమానమైన పాత్ర చేయమని అవకాశం వచ్చింది.ఈ చిత్రాన్ని అమెరికాలో ఏకంగా 40 రోజుల షూటింగ్‌ను ప్లాన్‌ చేశారు. కానీ ప్రస్తుతం తాను దిల్‌ రాజు - సతీష్‌ వెగ్నేష్‌ల దర్శకత్వంంలో 'శ్రీనివాస కళ్యాణం', తర్వాత దిల్‌ రాజు నిర్మాణంలోనే హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో నితిన్‌ - శర్వానంద్‌లు హీరోలుగా రూపొందనున్న మల్టీస్టారర్‌ 'దాగుడు మూతలు' చిత్రాలకు డేట్స్‌ ఇచ్చేశాను. విక్రమ్‌ చిత్రం ఒప్పుకోవాలంటే ఈ రెండు చిత్రాలకు డేట్స్‌ ప్రాబ్లమ్స్‌ వచ్చాయి. దాంతోవిక్రమ్‌ చిత్రానికి నో చెప్పానంటున్నాడు. అయినా ఇంత మంచిచాన్స్‌ని కేవలం డేట్స్‌ వల్ల వదులుకోకుండా ఏదో విధంగా ఆయన కమల్‌-విక్రమ్‌ల చిత్రం చేసి ఉంటే బాగుండేదని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 

Nithiin Rejects That Crazy Offer:

Nithiin Opens Up About Kamal Haasan And Vikram film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ