Advertisementt

చిరు అచ్చం ప్రభాస్ లా ఉన్నాడంటా..!!

Sat 31st Mar 2018 09:59 PM
chiranjeevi,prabhas,sye raa movie  చిరు అచ్చం ప్రభాస్ లా ఉన్నాడంటా..!!
Chiru Copied Sye Raa Look From Prabhas చిరు అచ్చం ప్రభాస్ లా ఉన్నాడంటా..!!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ జీవిత చరిత్రను రామ్ చరణ్ నిర్మాతగా... సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ట్మాకంగా సైరా నరసింహారెడ్డి గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇండియాలోని పలు భాషల్లో విడుదల చేసేందుకు తగిన ఏర్పాట్లను  సినిమా మొదలైన రోజునే మొదలు పెట్టింది సైరా టీమ్. అయితే పలు భషాల్లోని నటులు భాగస్వామ్యులైన ఈ సినిమాలో బాలీవుడ్ నుండి అమితాబచ్చన్ మెగాస్టార్ చిరు కి అంటే సైరా నరసింహారెడ్డికి గురువుగా సైరా లో గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు. గత రెండు రోజులుగా సైరా షూటింగ్ లో పాల్గొంటున్న అమితాబ్ సైరా సినిమా ముచ్చట్లను సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. 

అమితాబ్ సైరా లో చేస్తున్న గెస్ట్ రోల్ షూటింగ్ కూడా ముగిసింది. అయితే సైరా సినిమా మీద అందరి ఫోకస్ పడాలంటే అమితాబ్ లాంటి నటుడు ఈ సినిమాని ప్రమోట్ చేస్తే ఆటోమాటిక్ గా సినిమాకి హైప్ వస్తుందని చిత్ర బృందం భావించిందేమో అందుకే సైరా లోని చిరు, నయనతార లుక్స్ ని అమితాబ్ ద్వారా వదిలింది. మరి ఆ లుక్స్ లో సైరా నరసింహారెడ్డిగా చిరు రాజసం ఉట్టిపడేలా కనబడుతుంటే, నయనతార మాత్రం సాంప్రదాయంగా చీర కట్టుకుని గృహిణి మాదిరిగా కనబడుతుంది. అయితే చిరంజీవి సైరా లుక్ ప్రభాస్ బాహుబలి లుక్ కి పోలిక పెడుతూ సోషల్ ఇండియాలో కామెంట్స్ చేస్తున్నారు. సైరా లుక్ లో చిరు పొడవాటి జుట్టు పెంచి.... గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు. దాంతో చిరు అచ్చం బాహుబలి లో ప్రభాస్ లా ఉన్నాడంటూ కామెంట్స్ మొదలయ్యాయి.

మరి బాహుబలిలో ప్రభాస్ ఎలాంటి ఆహార్యాన్ని, శరీరాన్ని పెంచి ఆజానుబాహుడిలా బాహుబలి అంటే ఇలానే ఉంటాడు అనిపించేలా అదరగొట్టాడు. ఇలాంటివి చెయ్యాలంటే కేవలం ప్రభాస్ వల్లే సాధ్యం అనేలా ఉంది ప్రభాస్ బాహుబలి లుక్. మరి ఇపుడు సైరా నరసింహారెడ్డి లో చిరంజీవి లుక్ బాహుబలి ప్రభాస్ లా ఉందంటూ పోలిక పెట్టడం మాత్రం కాస్త బాధాకర విషయమే. మరి సైరా నరసింహారెడ్డి ని ఉయ్యాలవాడ జీవిత చరిత్రను బేస్ చేసుకుని తీస్తున్నారు. మరి అప్పట్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎలా వుండేవాడో ఇపుడు చిరు సైరా లుక్ అలానే ఉంటుంది. మరి ఇలా ప్రభాస్ బాహుబలికి, చిరు సైరా లుక్స్ కి పోలిక పెట్టడం ఏమిటో గాని ఇప్పుడు మాత్రం ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంది.

Chiru Copied Sye Raa Look From Prabhas:

Chiranjeevi Sye Raa Movie Look Compare with Prabhas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ