విలక్షణ దర్శకుడు సుకుమార్ - మాస్ మెగా హీరో రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా శుక్రవారం విడుదలై థియేటర్స్ దుమ్ము దులుపుతుంది. గత మూడు నెలలుగా సినిమాలకు మొహం వాచిపోయిన తెలుగు మరియు ఓవర్సీస్ ప్రేక్షకులు ఈ రంగస్థలం సినిమాతో పండగ చేసుకుంటున్నారు. నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా బంపర్ హిట్ అవడంతో అటు చరణ్ ఇటు సుక్కు మరియు నిర్మాతలు అందరు ఆల్ హ్యాపీస్. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టడమే కాదు సినిమా పరిశ్రమలోని పలువురు ప్రముఖులు చరణ్ నటనను తెగ మెచ్చుకుంటున్నారు. అలాగే సమంత, అనసూయ, జగ్గు భాయ్, ఆది పినిశెట్టి నటనలకు జనాలు నీరజాలు పడుతున్నారు.
ఇక ఇండస్ట్రీలోని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సన్నిహితులు, అలాగే సినిమా నచ్చిన వారు రంగస్థలంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అందులో అందరిని ఆకర్షించి మాత్రం పవన్ క్రియేటివ్ వర్క్స్ చేసిన ట్వీట్, మెగా హీరో అల్లు శిరీష్ చేసిన ట్వీట్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. పవన్ క్రియేటివ్ వర్క్స్ రంగస్థలంలో అద్భుత నటనను కనబరచిన రామ్ చరణ్ కు, ఈ చిత్రం ఘన విజయం సాధించినందుకు దర్శకుడు సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నవీన్, చిత్రయూనిట్ కు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతోందని పీకే క్రియేటివ్ వర్క్స్ తన ట్విటర్ లో ట్వీట్ చేసింది.
ఇక అల్లు శిరీష్ కూడా తన బావ చరణ్ సినిమా సూపర్ హిట్ అవడంతో... తానింకా సినిమా చూడలేదని... రంగ..రంగా..రంగస్థలానానానానానా!!! రంగస్థలం గురించి మరి ప్రత్యేకంగా చెప్పాలంటే మా ఆర్ సీ (రామ్ చరణ్) గురించి సూపర్ డూపర్ రిపోర్ట్స్ వింటున్నాను. అలాగే ఈ రోజు రాత్రి సినిమాకు వెళ్తున్నాను అంటూ శుక్రవారం శిరీష్ ట్వీట్ చేసాడు. ఇంకా చాలామంది ప్రముఖులు రంగస్థలం లోని చరణ్ నటనను, సమంత లుక్స్ అండ్ నటనను, సుకుమార్ మేకింగ్ స్టయిల్ ని, ఆది పినిశెట్టి నటనను, అనసూయ రంగమ్మత్త పాత్రని, క్రూరత్వం నిండిన విలన్ గా జగపతి బాబు నటనను అందరూ పొగిడేస్తూ ట్వీట్స్ మీద ట్వీట్స్ చేస్తున్నారు.