మెగా ఫామిలీ నుండి చాలా మంది హీరోస్ ఎంటర్ అయ్యారు. కానీ ఒకే ఒక్క అమ్మాయి నాగ బాబు కూతురు హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంటర్ అయింది. దీంతో మెగా ఫామిలీ మొత్తానికి నిహారిక అంటే గారాబం ఎక్కువ. టాలీవుడ్ మెగాస్టార్ కి ఫ్రెండ్ అయిన బాలీవుడ్ మెగాస్టార్ నిహారిక భుజం మీద ప్రేమగా చెయ్యేసి ఫోటోలకి ఫోజులిచ్చాడు బిగ్ బీ.
పెద్ద మెగాస్టార్ ని కలిసిన ఆనందంలో నవ్వుతు ఫోటోకి ఫోజిచ్చింది నిహారిక. సైరా సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర కోసం హైదరాబాద్ వచ్చిన బిగ్ బీ ని కలిసి తన కోరికను నెరవేర్చుకుంది నిహారిక. ఫోటో దిగిన వెంటనే ఆ ఫోటోను తన సోషల్ అకౌంట్ లో పోస్ట్ చేసి.. ఓవర్ వెల్మ్డ్ అంటూ కామెంట్ కూడా పెట్టింది.
లేటెస్ట్ సైరా సినిమాలో తన లుక్ ఎలా ఉంటుందో అని ఓ ఫోటోను లీక్ చేసారు బిగ్ బీ. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలానే బిగ్ బీ ఫొటోస్ తో పాటు చిరంజీవి ఫొటోస్ కూడా లీక్ కావడంతో ఆ ఫొటోస్ లో చిరంజీవి లుక్ అదిరిపోవడం మెగా ఫ్యాన్స్ ఇప్పటి నుండి పండగ స్టార్ట్ చేసారు.