ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే వరుసగా మూడు హిట్ సినిమాలలో నటించిన మెహ్రీన్ కౌర్ కి ఇక తిరుగులేదనుకున్నారు అంతా. అయితే అమ్మడు మెగా హీరో సాయి ధరం తేజ్ పక్కన నటించిన జవాన్ సినిమా ప్లాప్ తో హిట్స్ కి బ్రేక్ పడడమే కాదు... మెహ్రీన్ కౌర్ బాగా లావుగా తయారవ్వడంతో అమ్మడుకి అవకాశాలు తగ్గిపోయాయి. బుల్లెట్ లా దూసుకెళుతుంది అనుకుంటే... స్పీడ్ బ్రేకర్ లా ఆమె బొద్దు తనం అడ్డుపడడంతో కాస్త డల్ అయ్యింది. రవితేజ తో రాజా డి గ్రేట్ తో హిట్ అందుకున్నప్పటికీ ఆ సినిమాలో మెహ్రీన్ లుక్స్ క్యూట్ గా ఉన్నా కూడా... ఆమె పెంచిన బరువు వల్ల ఆమెకి కాస్త మైనస్ మార్కులే పడ్డాయి.
అయితే నిన్నగాక మొన్న వచ్చిన తొలిప్రేమ సినిమాలో కూడా ఛాన్స్ కోల్పోవడానికి కారణం ఆమె బొద్దు తనమే. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ ని తీసుకుందామనుకున్న దర్శకుడికి ఆమె బరువు చూసి వెనక్కి తగ్గడమే కాదు... మొదట్లో బొద్దుగా వుంది ఉన్నట్లుండి సన్నగా నాజూగ్గా మారిన రాశి ఖన్నా కి ఛాన్స్ ఇచ్చాడు వెంకీ అట్లూరి. మరి తొలిప్రేమ హిట్ ని అలా కోల్పోయింది మెహ్రీన్. అయితే అప్పుడు వరుణ్ సరసం ఛాన్స్ కోల్పోయినా... కానీ ఇప్పుడు వరుణ్ తేజ్ పక్కన ఛాన్స్ కొట్టేసినట్లుగా తెలుస్తుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ - వరుణ్ తేజ్ లు కలిసి నటిస్తున్న 'ఎఫ్ 2' లో వరుణ్ తేజ్ కి జోడిగా నటించే అవకాశం దక్కింది. ఇకపోతే వెంకటేష్ సరసన తమన్నాని సెలెక్ట్ చేసిన అనిల్ రావిపూడి వరుణ్ వరుణ్ తేజ్ కి మెహ్రీన్ ని ఎంపిక చేసాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకేయనుంది.