నితిన్ వరుసగా దశాబ్దం పాటు హిట్ అనే సినిమా మొహం చూసి ఎరుగడు. ఎంత పెద్ద నిర్మాత కుమారుడు అయినా ఆ పరిస్థితిని తట్టుకోవడం కష్టం. ఇక ఈయనకు పవన్ కళ్యాణ్ దేవుడు. ఈయన ఫ్లాప్‌ల పరంపరలో ఉన్న సమయంలో విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వచ్చిన 'ఇష్క్' ద్వారా మరలా హిట్‌ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత వచ్చిన 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రం కూడా బాగా ఆడటంతో నితిన్ మరలా ట్రాక్‌లోకి వచ్చాడు. త్రివిక్రమ్‌శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ హీరోగా సమంతతో కలిసి నటించిన 'అ..ఆ' చిత్రం 50కోట్ల క్లబ్‌లో చేరినప్పటికీ క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్ శ్రీనివాస్, సమంతల ఖాతాలో పడింది.
ఇక 'అ...ఆ' తర్వాత ఆయన హనురాఘవపూడి వంటి టాలెంటెడ్ దర్శకుడితో మేఘా ఆకాష్ హీరోయిన్‌గా యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన 'లై' చిత్రం డిజాస్టర్ అయింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇక వచ్చేనెల అంటే ఏప్రిల్ 5వ తేదీన నితిన్ నటిస్తున్న 'చల్ మోహన రంగ' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రాన్ని పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డిలు సంయుక్తంగా నిర్మాస్తుండటంతో అంచనాలు తారా స్థాయిలోఉన్నాయి.
ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ, నాకు తండ్రి తర్వాత అంత ఇష్టమైన వారు ఇద్దరే.వారే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్. వారి సొంత చిత్రంలో నేను నటించడం ఎంతో ఆనందంగా, నమ్మశక్యంగా లేదు. ఇక ఈ కథ గురించివాకబు చేసిన పవన్ ఈ కథను త్రివిక్రమ్ ఇచ్చాడని తెలుసుకుని, దీనికి నేను నిర్మాతగా ఉంటాను అని చెప్పారు. ఇక ఈ చిత్రాన్ని నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాసే దర్శకత్వంలో చేయాలని భావించాడు. కానీ పలు బిజీల వల్ల కృష్ణచైతన్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.
'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రం తర్వాత నేను నటిస్తున్న ఫుల్‌లెంగ్త్ కామెడీ చిత్రం ఇది. ఇందులో విపరీతమైన ట్విస్ట్‌లు ఏమీ ఉండవు. చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ స్టోరీ. ఇక నాకు రాజకీయాలపై సరైన అవగాహన లేదు. కానీ పవన్ గారి ఐడియాలజీ మాత్రం బాగా తెలుసు. పాలిటిక్స్‌ని మార్చగల సత్తా,ఆలోచనా విధానం ఆయనకు ఉన్నాయి. ఇక నాకు ఏ నటి తో ఎఫైర్‌లేదు. ఇంట్లోవాళ్లు అమ్మాయిని చూస్తున్నారు. వారు చూపినవారినే చేసుకుంటాను అని చెప్పుకొచ్చాడు. ఇక 'లై' ఇంటెలిజెంట్ మూవీ అని చెబుతూనే ఈ చిత్రం రిలీజ్ డేట్ లో తప్పు జరిగిందని, మరో రెండు సినిమాలు రిలీజ్ కావడంతో ప్రేక్షకులు ఏ చిత్రం చూడాలా? అని అయోమయానికి గురయ్యారని చెప్పాడు.ఇది నిజమేనని చెప్పాలి...!