ప్రస్తుతం వరుస హిట్స్ మీద ఉన్నయంగ్ హీరో ఎవరు అంటే ఖచ్చితంగా అందరు నేచురల్ స్టార్ నాని గురించి చెబుతారు. హీరోగా సెటిల్ అవుతున్న సమయంలోనే పెళ్లి చేసుకున్న నానికి కిందటి ఏడాది మగపిల్లాడు పుట్టాడు. వాడికి అర్జున్ అనే పేరు పెట్టారు. ఇక వీడిని నాని జున్ను అని ముద్దుగా పిలుస్తుంటాడు. తనకి ఏమాత్రం గ్యాప్ వచ్చినా ఆయన తన కుమారుడికే సమయం కేటాయిస్తాడు. తన బాబుతో కలిసి నానా అల్లరి చేస్తాడు. ఇక కొడుకు పుట్టిన నాడు నాని చేసిన హడావుడి అంతా ఇంతా కాదనే చెప్పాలి. ప్రతి కార్యాన్ని సంప్రదాయబద్దంగా చేశాడు.
ఇక తాజాగా తన కుమారుడు అర్జున్ మొదటి ఏడాది బర్త్‌డే సందర్భంగా నాని తన కారులో తన కుమారుడిని ఎత్తుకుని ప్రేమతో ముచ్చట్లు, ఆటాడుతున్న ఫొటోని పోస్ట్ చేశాడు. ఈ హ్యాపీ మూమెంట్స్‌ని ఫొటోగా తీసి అభిమానులలో సంతోషం నింపి ఆసక్తికరమైన కామెంట్స్ పెట్టాడు. 'ది లిటిల్ రాస్కెల్ టర్న్స్ వన్ టుడే. దొంగనా కొడుకు.. జున్నుగాడు' అని ట్వీట్ చేశాడు. ఈ ఫొటోతో పాటు ఆయన చేసిన డిఫరెంట్ విషెష్ కూడా వైరల్ అవుతున్నాయి.
ఇక ప్రస్తుతం నాని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మూడోసారి ద్విపాత్రాభినయం చేస్తూ 'కృష్ణార్జునయుద్దం'లో నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే నెల మొదలుకానుంది. మరోవైపు నాగార్జునతో చేస్తోన్న మల్టీస్టారర్ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ చిత్రంలోనాని సరసన 'కన్నడ కిర్రాక్‌పార్టీ', తెలుగులోతాజాగా 'హలో'తో ఊపుమీదున్న రష్మికా మండన్న ఇందులో నటిస్తోంది. దీని తర్వాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడని వినిపిస్తోంది.