Advertisementt

వర్మ కంట్లో పడింది..!

Sat 31st Mar 2018 11:30 AM
tagaru,manvitha harish,ram gopal varma  వర్మ కంట్లో పడింది..!
Director Offers Her Additional 10 Lakhs వర్మ కంట్లో పడింది..!
Advertisement

కొత్త టాలెంట్‌ని వెలికితీయడంతో రాంగోపాల్‌వర్మని మించిన వారు లేరనే చెప్పాలి. ఆయన ప్రతి ఒక్క దర్శకుడు తమ 30, 40 ఏళ్ల కెరీర్‌లో అందించినదానికంటే కేవలం తన అతి తక్కువ చిత్రాల ద్వారా ఎందరో దర్శకులను పరిచయం చేశాడు. ఇక చిన్నా, రాంజగన్‌, ఉత్తేజ్‌తో పాటు జెడి చక్రవర్తి, వివేక్‌ ఓబేరాయ్‌ వరకు ఆయన ద్వారా సినీ ఫీల్డ్‌కి ఎంటర్‌ చేసిన వారు ఎందరో ఉన్నారు. ఇక దర్శకుల్లో శివనాగేశ్వరరావు, కృష్ణవంశీ, తేజ, పూరీజగన్నాథ్‌ నుంచి ఎందరో దర్శకులు ఈయన కంపెనీ ద్వారా వెలుగులోకి వచ్చారు. ఇంకా లెక్కలేనంత మందికి ఆయన పరోక్షంగా కూడా ఇన్‌స్పిరేషన్‌గా మారాడు. దర్శకులు కావాలంటే ఏళ్లకు ఏళ్లు ఎవరికిందనో డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయాల్సిన అవసరం లేదని, కొత్త ఆలోచనలు, థాట్స్‌ ఉన్న వారు ఏకంగా దర్శకులుగా మారడం ఎలా? అనే విషయాలను ఆయన నిరూపించారు. 

ప్రస్తుతం ఆయన నాగార్జునతో 'శివ, అంతం, గోవింద గోవింద' చిత్రాల తర్వాత తన కంపెనీ బేనర్‌లోనే నాగార్జున హీరోగా 'ఆఫీసర్‌' అనే చిత్రాన్ని తీస్తున్నాడు. ఈ చిత్రం మే 25వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. ఇక తాజాగా ఆయన నాగార్జున చిన్న తనయుడు అఖిల్‌ నటించే నాలుగో చిత్రానికి కూడా తానే దర్శకుడిని అని, ఇది లవ్‌స్టోరీ కాదని, లవ్‌తో పాటు హైఇంటెన్సిటివ్‌ కలిగిన యాక్షన్‌ చిత్రమని చెప్పుకొచ్చాడు. ఇక మరుగున పడిపోయిందని భావిస్తున్న 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చిత్రాన్ని కూడా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. 

ఈయన తాజాగా కన్నడ స్టార్‌ శివరాజ్‌కుమార్‌ నటించిన 'టగరు' అనే చిత్రాన్ని ఈయన ఆ చిత్ర యూనిట్‌తో కలిసి చూశాడు. చిత్రం చూసిన తర్వాత ఆయన మాట్లాడుతూ, ఇందులో నటించిన హీరోయిన్‌ మాన్విత హరీష్‌ కేవలం హీరోయిన్‌ మాత్రమే కాదని చెప్పాడు. ఈ సినిమాలో ఆమె తన నటనతో అందరినీ విస్మయానికి గురి చేసిందని, తన తదుపరి చిత్రంలో ఆమె హీరోయిన్‌ అని ప్రకటించాడు. ఈ సినిమాకి ఆమె డిమాండ్‌ చేసిన మొత్తం కంటే 10లక్షలు అదనంగా ఇస్తానని, ఇక ఈ చిత్ర దర్శకుడు సూరితో కలిసి ఓ చిత్రాన్ని నిర్మిస్తానని చెప్పాడు. మరి వర్మ మాన్విత హరీష్‌కు ఏ చిత్రంలో ఏ పాత్రను ఇస్తాడో వేచిచూడాల్సివుంది..! 

Director Offers Her Additional 10 Lakhs:

RGV Offers Her Additional 10 Lakhs

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement