అల్లు అర్జున్ కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మాతగా రూపొందిన 'గంగోత్రి' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. కానీ అంతకు ముందే ఆయన చిరంజీవి నటించిన 'డాడీ' చిత్రంలో స్టెప్స్ వేసి ప్రేక్షకులను అలరించాడు. ఇక అల్లు అర్జున్‌ని 'గంగోత్రి'లో చూసిన వారు అసలు ఇతను హీరోనేనా? అని అనుకున్నారు. కానీ 'ఆర్య'తోనే సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత స్టైలిష్‌స్టార్‌గా ఎదగడానికి ఆయనకేమీ ఎక్కువ సమయంపట్టలేదు.
ఇక బన్నీకెరీర్‌లో అపజయాల శాతంకూడా తక్కువే. తెలుగుతో పాటు మలయాళం, బాలీవుడ్ డిజిటల్, శాటిలైట్స్ ద్వారా కూడా పాపులర్ అయ్యాడు. యూత్‌నే కాదు... అన్ని వర్గాల ప్రేక్షకునలు ఆదరించేలా కష్టపడి, అన్నివర్గాలకు చేరువయ్యాడు. దాంతో ఆయన చిత్రాలు ఎలా ఉన్నా కూడా హయ్మెస్ట్ గ్రాసింగ్ సినిమాలుగా బాక్సాఫీస్ వద్ద నిలబడుతున్నాయి. యావరేజ్ కంటెంట్‌తో కూడా హిట్స్ కొడుతున్నాడు.
ఇక తన 15ఏళ్ల జర్నీ సందర్భంగా ఆయన తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. తన మొదటి చిత్రానికి పనిచేసిన రాఘవేంద్రరావు, అశ్వనీదత్, తన తండ్రి అల్లుఅరవింద్‌లకు పేరుపేరునా రుణపడి ఉన్నానని తెలిపాడు. ఇక ఈయన 'డాడీ' చిత్రంలో ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్‌ని గుర్తించి డ్యాన్స్‌లపై ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఈ విధంగా ఆయన స్టార్‌హీరోగా టాప్‌లీగ్‌లోకి ఎంటర్ కావడమే కాదు... డ్యాన్స్‌లపరంగా, సిక్స్‌ప్యాక్ నుంచి పలు విధాలైన మేకోవర్ల ద్వారా ప్రేక్షకులందరి ఆదరణను పొందుతున్నాడు...! తనని ప్రోత్సహించిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాడు.