Advertisementt

సైరా పై అంచనాలు పెంచేస్తున్న బిగ్ బి!!

Fri 30th Mar 2018 12:12 PM
amitabh bachchan,chiranjeevi,nayanthara,sye raa movie  సైరా పై అంచనాలు పెంచేస్తున్న బిగ్ బి!!
Amitabh Bachchan Reveals Looks Of Chiranjeevi And Nayanthara From Sye Raa సైరా పై అంచనాలు పెంచేస్తున్న బిగ్ బి!!
Advertisement

చిరంజీవి - బిగ్ బి - నయనతార - విజయ్ సేతుపతి - జగపతి బాబు - కిచ్చ సుదీప్ కాంబోలో ఎంతో ప్రతిష్ట్మాకంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ మొదలవ్వడమే లేట్ కానీ షూటింగ్ ని మాత్రం పరిగెత్తిస్తున్నారు సురేందర్ రెడ్డి అండ్ టీమ్. భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ని సురేందర్ రెడ్డి ఎంతో స్టైలిష్ గా తెరకెక్కిస్తున్నాడని చెబుతుంది చిత్ర బృందం. కేవలం చిత్ర బృందమే కాదండోయ్ ఇప్పుడు ఈ సినిమాలో సైరా నరసింహారెడ్డి కి గురువుగా నటిస్తున్న అమితాబ్ ఈ సినిమా ముచ్చట్లు మాములుగా చెప్పట్లేదు. ఫస్ట్ షెడ్యూల్ లో చిరు మీద కొన్ని సీన్స్ ని షూట్ చేసిన సురేందర్ రెడ్డి సెకండ్ షెడ్యూల్ లో మాత్రం అమితాబ్, నయనతార, చిరంజీవి కాంబినేషన్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నాడు. 

సై రా షూటింగ్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన అమితాబ్ సైరా సినిమా విషయాలను కథలు కథలుగా చెప్పడమే కాదు.. దానికి సంబందించిన ఫొటోస్ ని కూడా లీక్ చేసాడు. ఆఖరికి ఆయన సైరా లో పోషించబోయే పాత్ర లుక్ దగ్గరనుండి చిరు తో నయనతార కాంబో లుక్  ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. సైరా నరసింహారెడ్డి పక్కనే కూర్చుని హోమం చేస్తున్న నయనతార అబ్బో చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదనడానికి ఈ ఫొటోస్ నిదర్శనం. చిరు - నయన్ లు కలిసి వేద పండితుల సాక్షిగా హోమం చేస్తూ వారి ఆశీర్వాదంతో పాటు అక్కడే ఉన్న గురువు అమితాబ్ ఆశీర్వాదం తీసుకుంటున్న ఈ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

ఇక చిరు సైరా లుక్, నయనతార లుక్ మాత్రం సూపర్ అన్నట్టుగా వున్నాయి. మరి ఇలా లుక్స్ తో అదరగొట్టేస్తూ సినిమాపై ఉన్న అంచనాలు భారీగా పెంచేసింది. రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా దేశంలోని పలు భాషల్లో విడుదల కాబోతుంది. అందుకు తగ్గట్టుగానే ఈ సై రా సినిమా భారీ అంగులతో తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలున్నాయి.

Amitabh Bachchan Reveals Looks Of Chiranjeevi And Nayanthara From Sye Raa:

Amitabh Bachchan Reveals Looks Of Chiranjeevi And Nayanthara From Sye Raa

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement