Advertisementt

సునీల్‌ క్యారెక్టర్‌ తెలిసిపోయింది...!

Fri 30th Mar 2018 01:56 PM
hero sunil,ravi teja,veerabhadram chowdary  సునీల్‌ క్యారెక్టర్‌ తెలిసిపోయింది...!
Hero Sunil Turns Comedian For Ravi Teja's Film సునీల్‌ క్యారెక్టర్‌ తెలిసిపోయింది...!
Advertisement
Ads by CJ

సునీల్‌ కమెడియన్‌గా ఉన్నప్పుడు ఎంతో బిజీగా క్షణం తీరిక లేకుండా సినిమాలతో బిజీ బిజీగా ఉండేవాడు. ఇక ఆయన తన స్నేహితుడైన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో చేసిన చిత్రాలు ఆయనకు కమెడియన్‌గా ఎంతో పేరును తీసుకొచ్చాయి. అలాంటి సునీల్‌ హీరోగా మారిన తర్వాత 'అందాలరాముడు, మర్యాదరామన్య, పూలరంగడు' చిత్రాలు బాగా ఆడాయి. మరోవైపు నాగచైతన్యతో కలసి నటించిన 'తడాఖా' చిత్రం కూడా బాగానే ఆడింది. 

కానీ ఆ తర్వాత మాత్రం ఈయనకు వరుసగా డిజాస్టర్స్‌ వచ్చాయి. దాంతో తప్పని సరి పరిస్థితుల్లో ఆయన మరలా కమెడియన్‌గా టర్న్‌ ఇచ్చుకున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ త్రిపాత్రాభినయం చేస్తోన్న 'అమర్‌ అక్బర్‌ ఆంటోని' చిత్రంతో పాటు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా రూపొందుతున్న చిత్రంలో సునీల్‌ ఓ పాత్రను చేస్తున్నాడు. ఇది కమెడియన్‌గా ఉంటూనే ఎంతో కీలకమైన పాత్ర అని సమాచారం. ఇందులో సునీల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా కనిపిస్తాడని సమాచారం. 

ఇక సునీల్‌ అల్లరి నరేష్‌తో కలిసి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో 'తమిళపదం2' రీమేక్‌తో పాటు 'పూలరంగడు' తీసిన వీరభద్రం చౌదరి దర్శకత్వంలో మరో చిత్రంలో కూడా నటించడానికి ఒప్పుకున్నాడట. ఓవైపు వీరభద్రమ్‌ చౌదరి 'అహ నా పెళ్ళంటా , పూలరంగడు' ద్వారా మెప్పించినప్పటికీ నాగార్జునతో చేసిన 'భాయ్‌' చిత్రం పెద్ద షాక్‌నే ఇచ్చింది. ఆ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన వీరభద్రం తాజాగా సునీల్‌కి కథ చెప్పి ఓ కే చేయించాడని అంటున్నారు. మరి ఇకనైనా సునీల్‌ సుడి తిరుగుతుందో లేదో వేచిచూడాల్సివుంది..! 

Hero Sunil Turns Comedian For Ravi Teja's Film:

Hero Sunil Turns Comedian For Ravi Teja's Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ