రంగస్థలం మరో 24 గంటల్లో ప్రేక్షకులలముందు ఉండబోయే రామ్ చరణ్ చిత్రం. సంక్రాతి తర్వాత ఇంతవరకు ఒక్క భారీ బడ్జెట్ చిత్రం కూడా విడుదలకాలేదు. వేసవి మొదలయ్యాక మొదటిసారి విడుదలవుతున్న భారీ బడ్జెట్ చిత్రం రంగస్థలం. రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే మరో 24 గంటలో విడుదలకాబోయే రంగస్థలం చిత్రం కథ గురుంచి అనేక రకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పల్లెటూరి పగలు ప్రతీకారులకు ప్రతీకగా ఈ రంగస్థలం నిలవబోతుంది అనేది ఈ రంగస్థలం ట్రైలర్ లోనే చూసాము.
అయితే ఈ సినిమాలో విలన్ ఎవరనే దాని మీద పెద్ద చర్చే ఫిలింసర్కిల్స్ లో జరుగుతుంది. మరి రంగస్థలం ట్రైలర్ లో జగపతిబాబే విలన్ గా అనిపిస్తునాడు. కానీ రంగస్థలం విలన్ మాత్రం జగపతి బాబు కాదు చిట్టిబాబు ఉరఫ్ రామ్ చరణ్ కి అన్నగా నటిస్తున్న కుమార్ బాబు ఉరఫ్ ఆది పినిశెట్టి అనే టాక్ వినబడుతుంది. అయితే సినిమా చివరివరకు ఈ విషయం చిట్టిబాబుకి తెలియక అన్న కుమార్ మీద ప్రాణాలే పెట్టుకుంటాడని... ఈ సస్పెన్స్ సినిమాకి హైలెట్ నిలుస్తుందని రూమర్స్ ఇప్పుడు ఫిలింసర్కిల్స్ జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. సినిమా మొదలైనప్పటినుండి చివరివరకు ఆది పినిశెట్టి క్యారెక్టర్ సైలెంట్ గా అమాయకంగా ఉంటూనే గొంతుకోసి నేర్పరితనంతో ఉంటుందని.... సినిమా క్లైమాక్స్ లోనే కుమార్ బాబు అసలు కేరెక్టర్ బయటికొస్తుందని కూడా ప్రచారం జరుగుతుంది.
మరి పల్లెటూర్లలో పగలు మొదలైతే అవి ఎన్నిఅనర్ధాలకు దారితీస్తాయో అనేది దర్శకుడు సుకుమార్ ఈ సినిమా ద్వారా కళ్ళకు కట్టినట్టుగా చూపించబోతున్నాడని మాత్రం అర్ధమవుతుంది. అయితే ఈ సినిమాలో విలన్ జగపతి బాబా... లేదంటే ఆది పినిసెట్టా అనేది మాత్రం మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది.