Advertisementt

సి. కళ్యాణ్ పై ఆగ్రహించిన సీనియర్ హీరో?

Thu 29th Mar 2018 01:43 PM
balakrishna,c kalyan,vv vinayak  సి. కళ్యాణ్ పై ఆగ్రహించిన సీనియర్ హీరో?
Balakrishna Angry With C Kalyan సి. కళ్యాణ్ పై ఆగ్రహించిన సీనియర్ హీరో?
Advertisement
Ads by CJ

రేపు మార్చ్ 29  న తన తండ్రి బయోపిక్ ని మొదలు పెట్టబోతున్న బాలకృష్ణ వరుసగా సినిమాలు ఒప్పేసుకుంటూ వెళుతున్నాడు. జై సింహ తర్వాత తన తండ్రి బయోపిక్ విషయంలో కాస్త సీరియస్ గా వున్న బాలకృష్ణ... ప్రస్తుతం ఆ సినిమా ని పట్టాలెక్కించే పనిలో బిజీగా వున్నాడు. తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ టైటిల్ తో తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయోపిక్ ని సాయి కొర్రపాటి నిర్మాతగా బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బోయపాటితో ఒక సినిమాని.. వినాయక్ డైరెక్టన్ లో మరో సినిమా చేయనున్నాడు. అయితే బోయపాటితో సినిమా ఎప్పటినుండో ప్రచారంలో ఉన్న న్యూస్. 

కానీ వినాయక్ తో సినిమా అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చిన సరికొత్త న్యూస్. ఇంటిలిజెంట్ సినిమా ప్లాప్ తో వినాయక్ పనైపోయింది అనుకున్న టైం లో అనూహ్యంగా సి కళ్యాణ్ బాలకృష్ణ - వినాయక్ కాంబోలో ఒక సినిమా ని నిర్మిస్తున్నాని ఆఫీషియల్ గా అనౌన్స్ కూడా చేసాడు. అయితే వినాయక్ తో బాలయ్య సినిమా ఏమిటి అని బాలయ్య ఫాన్స్ వర్రీ అవుతున్నారు. అయితే వినాయక్ ఇంకా బాలయ్యకి కథ చెప్పలేదని... స్టోరీ లైన్ విన్నాక సి కళ్యాణ్ నిర్మాతగా సినిమా చేద్దామని వినాయక్ కి బాలయ్య కేవలం మాట మాత్రమే ఇచ్చాడని.. కానీ సి కళ్యాణ్ తొందరపడి బాలయ్య డెసిషన్ కరెక్ట్ గా కనుక్కోకుండానే వినాయక్ - బాలయ్య కాంబోలో మూవీ గురించి ఆఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చెయ్యడంతో సి కళ్యాణ్ మీద బాలయ్యకి కోపమా వచ్చినట్లుగా తెలుస్తుంది. 

అసలు పూర్తిగా స్టోరీ సిట్టింగ్ జరక్కుండా ఇలా ఆఫీషియల్ అనౌన్సమెంట్ ఎవరిమ్మన్నారని సి కళ్యాణ్ ని బాలయ్య కోప్పడినట్లుగా వార్తలోస్తున్నాయి. మరి నిజంగా వినాయక్ తో సినిమా విషయమై బాలకృష్ణ స్పందించేవరకు వినాయక్ - బాలయ్య కాంబో మీద క్లారిటీ రాదు.

Balakrishna Angry With C Kalyan:

Balakrishna Angry With C Kalyan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ