Advertisementt

అన్ని 'R' లే ఉండేలా చూస్తున్నారా?

Thu 29th Mar 2018 12:48 PM
rrr,ss rajamouli,jr ntr,ram charan  అన్ని 'R' లే ఉండేలా చూస్తున్నారా?
Rajamouli R Sentiment అన్ని 'R' లే ఉండేలా చూస్తున్నారా?
Advertisement
Ads by CJ

రాజమౌళి ఏది చేసిన సెన్సేషనే అనడంతో ఎటువంటి అతిశయోక్తి లేదు. మూడు నెలలక్రితం రామ్ చరణ్ తో ఎన్టీఆర్ తో కలిసి ఒక ఫోటో దిగిన రాజమౌళి ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసాడో అనేది ప్రత్యక్షంగా చూసాం. ఆ ఒక్క ఫోటో పట్టుకుని ఎన్ని రకాల న్యూస్ లు సృష్టించాలో అన్ని రకాల న్యూస్ లు సృష్టించారు. అసలా ఫోటో సోషల్ మీడియా నుండి వెబ్ మీడియా, ప్రింట్ మీడియా వరకు ఎంత సెన్సేషన్ సృష్టించాలో అంత సెన్సేషన్ సృష్టించింది. అలాగే మా సినిమా ఉంటుంది అని అధికారికముగా ప్రకటించడానికి కూడా రాజమౌళి తన పేరు, రామ్ చరణ్ పేరు ఎన్టీఆర్ పేర్లలో మొదటి అక్షరాన్ని #RRR అని కొత్తగా ప్రకటింపజేసాడు. మరి తమ పేరులోని మొదటి అక్షరం రాజమౌళి, రామ్ చరణ్, రామారావు లలో R అనే అక్షరాన్ని హైలెట్ చేసి చూపించాడు.

అలాగే రాజమౌళి ఈ R  సెంటిమెంట్ ని నమ్ముతున్నాడో లేదో గాని ఇప్పుడు రాజమౌళి సినిమాలో నటించబోయే  నటీనటులు పేర్లు కూడా మొదటగా R  అక్షరంతోనే స్టార్ట్ అయ్యే పేర్లే ఎక్కువగా వినబడుతున్నాయి. అవేమిటంటే నిన్నటికి నిన్న హీరో రాజశేఖర్  ఈ సినిమాలో విలన్ గా నటిస్తాడేమో అనే రూమర్ ఫిలింసర్కిల్స్ లో బాగా హల్చల్ చేసింది. అలాగే హీరోయిన్ విషయంలోనూ అంతే. రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా లు ఈ మల్టీస్టారర్ లో నటించబోతున్నారని అంటున్నారు. మరి ఎలా చూసుకున్న వీరి పేర్లలో మొదటి అక్షరం R  ఉండడంతో ఆందరూ రాజమౌళి R  సెంటిమెంట్ నమ్ముతున్నాడని ఫిక్స్ అవుతుండగా.. ప్రస్తుతం మరో హీరోయిన్ R  అక్షరంతో మొదలవ్వబోయే పేరు తెరమీదకి వచ్చింది.

ఛలో సినిమాతో టాలీవుడ్ గడప తొక్కిన రక్ష్మిక మడన్న పేరు ఇప్పుడు రాజమౌళి మల్టీస్టారర్ సినిమాకోసం వినబడుతుంది. అయితే రాజమౌళి మాత్రం కేవలం ఎన్టీఆర్, రాజమౌళి తో సినిమా అని మాత్రం చెప్పాడు గాని ఇంకా వారికే స్టోరీ లైన్ కూడా వినిపించలేదట. అలాగే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా వున్నాడట. మరి అసలు నటీనటుల ఎంపిక కూడా చేపట్టని జక్కన ఇలా R  సెంటిమెంట్ నమ్మే పరిస్థితి ఉంటుందో.... అంటే ఆబ్బె అదేం లేదంటూ రాజమౌళి సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు.

Rajamouli R Sentiment:

Rajamouli R Sentiment

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ