మెగాహీరో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు భార్య ఉపాసన సమక్షంలో బాగానే జరుగుతున్నాయి. మరోపక్క మెగా ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్ని ఘనంగానే చేస్తున్నారు. అలాగే సినిమా పరిశ్రమలోనూ రామ్ చరణ్ స్నేహితులు, రామ్ చరణ్ సన్నిహితులు చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. రామ్ చరణ్ తమ్ముడు వరుణ్ తేజ్, సాయి ధరమ్.. చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ రానా, శర్వానంద్, నితిన్ వంటి వారు రామ్ చరణ్ కి సోషల్ మీడియాలో అదిరిపోయేలా విషెస్ చెప్పారు. అయితే భార్య ఉపాసన నుండి, తండ్రి చిరు, తల్లి సురేఖ నుండి సర్ప్రైజ్ గిఫ్ట్ లు అందుకున్న చరణ్ మరొకరినుండి కూడా మరో అద్భుతమైన గిఫ్ట్ అందుకున్నాడు. మరి అది గిఫ్ట్ అనాలా లేదా అనేది మీరే తేల్చండి.
రంగస్థలంలో రామ్ చరణ్ కి అత్తగా రంగమ్మగా నటించిన అనసూయ.. అల్లుడు చిట్టి బాబు కోసం వాచ్ ప్రెజెంట్ చేసింది. మరి రంగస్థలం మేకింగ్ ఫొటోస్ లో రంగమ్మత్త చిట్టిబాబు చేతికి ఆ వాచ్ పెడుతున్న పిక్ ని అనసూయ సోషల్ ఇండియాలో పోస్ట్ చేసింది. రంగమ్మత్త అనసూయ ఎంతో ప్రేమగా అల్లుడు చిట్టిబాబు ఉరఫ్ రామ్ చరణ్ చేతికి వాచ్ పెడుతున్న ఆ ఫోటో రామ్ చరణ్ పుట్టిన రోజునాడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అనసూయ ని చూసి మెగా ఫాన్స్ అల్లుడు కోసం ఎంతమంచి గిఫ్ట్ ఇచ్చిందో రంగమ్మత్త అంటూ కామెట్స్ చేస్తున్నారు.