రకుల్ ప్రీత్ సింగ్ నిన్నమొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ చైర్ లో కూర్చుంది. స్టార్ హీరోలందరితోను జోడి కట్టిన రకుల్ ప్రీత్ సింగ్ మరో ఐదారేళ్లు హీరోయిన్ గా టాలీవుడ్ ని ఏలుతుంది అనుకుంటే... అమ్మడుకి వరుసగా నాలుగైదు ప్లాప్స్ వచ్చేసరికి ఇక టాలీవుడ్ లో ఆఫర్స్ అనేవే లేకుండా పోయాయి. అయితే స్పైడర్ తో తమిళంలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇద్దామనుకున్న రకుల్ కి ఆ సినిమా తో అట్టర్ ప్లాప్ ని ఇచ్చింది. అసలు అట్టర్ ప్లాప్ తో ఎంట్రీ ఇచ్చినా కూడా ప్రస్తుతం అమ్మడు తమిళనాట పాగా వెయ్యడానికి రెడీ అవుతుంది
ఇప్పటికే సూర్య సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు శివ కార్తికేయన్ సినిమాలోనూ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ఆర్. రవి కుమార్ దర్శకత్వంలో ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాలో శివ కార్తికేయన్ కి జోడిగా రకుల్ ఎంపికయ్యింది. మరి ప్రస్తుతం టాలీవుడ్ లో ఖాళీ అయిన రకుల్ ఇక్కడ కోలీవుడ్ లో మాత్రం బాగా బిజీగా మారేట్లుగానే కనబడుతుంది. మరోపక్క రకుల్ బాలీవుడ్ లోను పాగా వేయాలని కలలు కంటుంది. మరి కోలీవుడ్ లో రకుల్ ఆశలు నెరవేరినా బాలీవుడ్ లో మాత్రం పాప కలలు నిజమయ్యే ఛాన్సెస్ తక్కువే.