Advertisementt

'రంగస్థలం' నిర్మాణ సంస్థపై ఐటీ దాడులు!!

Wed 28th Mar 2018 01:09 PM
it raids,rangasthalam  'రంగస్థలం' నిర్మాణ సంస్థపై ఐటీ దాడులు!!
IT Raids on Mythri Movie Makers Banner 'రంగస్థలం' నిర్మాణ సంస్థపై ఐటీ దాడులు!!
Advertisement
Ads by CJ

మరో మూడు రోజుల్లో 'రంగస్థలం' సినిమా రిలీజ్ కాబోతున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థపై ఐటీ రైడ్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. పూర్తి ఆధారాలు లేనందున ఇది నిజమో కాదో తెలియదు కానీ ఈ సమ్మర్ రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాల్లో ఇది ఒకటి.

బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుందని భావించి ఆదాయపు పన్ను శాఖ అధికారులు పలు సోదాలు నిర్వహించినట్టు సమాచారం. దీని గురించి పూర్తి సమాచారం లేనప్పటికీ టాక్ మాత్రం జోరుగా నడుస్తోంది. ఇప్పటికే సినిమా బిజినెస్ పూర్తయింది. ఈ మూడు రోజులు కీలక దశ వ్యాపార లావాదేవీలు విస్తృతంగా ఉంటాయని అందుకే ఐటీ రైడ్ జరుగుతుంది అని తెలుస్తుంది. కొన్ని కీలకమైన ఫైల్స్ జప్తు చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.

సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు దీనిపై భారీ పెట్టుబడులు పెట్టిన నేపధ్యంలో ఊహకు అందని స్థాయిలో బిజినెస్ జరిగినట్టు గతంలోనే టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ దాడులు జరగడానికి కారణం ఇదే కావొచ్చు అని తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఆదాయపు పన్ను శాఖ అధికారులు నుండి సమాచారం తెలియాల్సిందే.

IT Raids on Mythri Movie Makers Banner:

IT Raids At Top Tollywood Production House

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ