Advertisementt

ఈ హీరోగారికి అప్పుడే అటు గాలి మళ్లీంది..!

Tue 27th Mar 2018 09:35 PM
sri vishnu,needi naadi oke katha,director  ఈ హీరోగారికి అప్పుడే అటు గాలి మళ్లీంది..!
Hero Sri Vishnu Turns director ఈ హీరోగారికి అప్పుడే అటు గాలి మళ్లీంది..!
Advertisement
Ads by CJ

కొంతమంది సినిమా ఇండస్ట్రీకి ఏదో అవుదామనుకుని వచ్చి ఇంకేదో అవుతుంటారు. ఇలా ఎప్పటినుండో జరుగుతున్నా ఇదే అయినా.. కూడా విన్నప్పుడు కొత్తగానే ఉంటుంది. అయితే నాని లాంటి వారు ఇండస్ట్రీలోకి డైరెక్టర్స్ అవుదామనుకుని వచ్చి హీరో అవతారమెత్తి అక్కడ సూపర్ సక్సెస్ అయినా కూడా ఎక్కడో ఒక మూలాన ఎప్పటికైనా ఒక సినిమా డైరెక్ట్ చెయ్యాలనే ఆలోచన ఉంటుంది. ఇక కొంతమంది హీరోలు అవకాశాలు తగ్గగానే డైరెక్టర్ అవతారమెత్తుదామని డిసైడ్ అవుతారు. ఇప్పుడు అలాంటి వారిలో ఎక్కువగా అల్లరి నరేష్, మంచు విష్ణు పేర్లు వినబడుతున్నా.... మరికొంతమంది హీరోలు ఇదే రూట్ ఫాలో అవుతూ ఇండస్ట్రీని షేక్ చేద్దామనుకుంటున్నారు.

తాజాగా ఇండస్ట్రీలో ఒక సపోర్టింగ్ యాక్టర్ గా ఎంటరై మెల్లగా హీరోగా మార్కెట్ పరిధిని పెంచుకుంటున్న శ్రీ విష్ణు కూడా డైరెక్టర్ అవ్వడానికి రెడీగా వున్నాడట. అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, నీదీ నాదీ ఒకే కథ సినిమాలతో మంచి హీరోగా పేరుతెచ్చుకున్న ఈ యువ హీరో శ్రీవిష్ణుకి డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఉందట. నీది నాది ఒకే కథ సినిమాతో హిట్ కొట్టి ఈ వీకెండ్ హీరోగా నిలిచాడు. నీది నాది ఒకే కథ సినిమాతో ఒక్కసారిగా తనవైపు చూపుతిప్పుకున్న ఈ హీరో ఆ సినిమా హిట్ ఇంటర్వూస్ లో భాగంగా తనకి డైరెక్షన్ అంటే ఇష్టమని చెబుతున్నాడు.

మరి డైరెక్టర్ అవ్వాలంటే ఒక మంచి బలమైన కథ దొరకాలని.. అలాగే పక్కాగా స్క్రిప్టు తయారైనపుడే తాను దర్శకుడిగా మారతానని చెబుతున్నాడు. ఇప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్ గా తాను చాలా నేర్చుకున్నానని కథతో పాటుగా మంచి నిర్మాత కూడా దొరకాలని కూడా శ్రీ విష్ణు కోరుకుంటున్నాడు. మరి అలా ఫ్యూచర్ లో మనం శ్రీవిష్ణు ని డైరెక్టర్ అవతారంలో చూడొచ్చన్నమాట.

Hero Sri Vishnu Turns director:

Hero Sri Vishnu Ready to Take Megaphone

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ