ప్రస్తుతం ఉన్న యంగ్‌స్టార్స్‌లో మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లుఅర్జున్, నాగచైతన్య, రామ్ వంటి యంగ్ హీరోలందరినీ కవర్ చేసిన ఘనత 'రంగస్థలం 1985'లో రామ్‌చరణ్‌తో పనిచేయడం ద్వారా సుకుమార్‌కి దక్కుతుంది. ఇక ఈ రామ్‌చరణ్ 'రంగస్థలం 1985' చిత్రం ఈనెల 30వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. ఇక ఈయన దాదాపు ఈతరం యంగ్ స్టార్స్ అందరినీ ఓ రౌండ్ వేశాడు. కానీ ఆయన లెక్కల్లో 'జగడం, ఆర్య2, 1నేనొక్కడినే' చిత్రాలు మాత్రం అనుకున్న విజయం సాధించలేదు. ఇక ఈయన పవన్, ప్రభాస్‌లతో చేస్తే యంగ్‌స్టార్స్ దాదాపు అందరు పూర్తి అవుతారు. మెదడుకు పనిపెట్టే చిత్రాలు తీస్తాడనే పేరున్న సుకుమార్ 'రంగస్థలం 1985' ద్వారా ఆ చెడ్డపేరును కూడా తొలగించుకోవాలని చూస్తున్నాడు. ఇక తన మనసులో మాటగా ప్రభాస్‌తో ఓ చిత్రం చేయాలనుందని తెలిపాడు. 'బాహుబలి'తో నేషనల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్‌తో చేయాలని ఏ డైరెక్టర్‌కి మాత్రం ఉండదు? అదే కోవలోకి సుకుమార్ కూడా వస్తున్నాడు. కాగా ప్రస్తుతం ప్రభాస్ బహుభాషా చిత్రాలపై దృష్టి పెట్టి ఉన్నాడు. సుకుమార్ కూడా అదే కోవలో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లన్నింటికి సూట్ అయ్యే యూనివర్శల్ సబ్జెక్ట్‌తో వస్తే ప్రభాస్ ఓకే అంటాడనే చెప్పవచ్చు. ఎందుకంటే సుకుమార్ వంటి క్రియేటివ్ జీనియస్‌ని ఎవరు మాత్రం కాదంటారు?
ఇక సుకుమార్ మాట్లాడుతూ, తనకు మల్టీస్టారర్స్ కూడా చేయాలని ఉందని తెలిపాడు. అయితే అది కత్తిమీద సాము వంటిదని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్-రామ్‌చరణ్‌లతో మల్టీస్టారర్ చేస్తున్న సమయంలో భవిష్యత్తులో ఇలాంటి చిత్రాలు మరిన్ని వస్తాయని అందరు భావిస్తున్నారు. ఇక ఈ విషయమై సుకుమార్ మాట్లాడుతూ, మల్టీస్టారర్ చిత్రాలలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇందులో ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి. ఆయా హీరోల స్థాయి, వారి అభిమానుల అంచనాలు, ఆయా హీరోల క్రేజ్ వంటివి దృష్టిలో ఉంచుకోవాలి. తారక్, చరణ్‌లా ఇంకెవరైనా ముందుకు వస్తే నేను మల్టీస్టారర్ చేయడం గ్యారంటీ అని ఆయన చెప్పుకొచ్చాడు...! ఇక ప్రభాస్ ప్రస్తుతం సుజీత్‌తో 'సాహో'. తర్వాత 'జిల్' రాధాకృష్ణ, కృష్ణంరాజు వంటి వారితో చేయాల్సివుంది. మరి సుక్కు కోరిక నెరవేరాలంటే ఎంతో సమయం పడుతుందని చెప్పవచ్చు.