హీరో శివాజీ తన కెరీర్‌ని జెమిటి టివిలో ఎడిటర్, యాంకర్‌గా స్టార్ట్ చేశాడు. కాదంబరికిరణ్, పూరీ వద్ద డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేశాడు. ఆ తర్వాత జూనియర్ ఆర్టిస్టు తరహాలో ఎన్నో చిన్న చిన్న పాత్రలు చేశాడు. 'శ్రద్దాంజలి'లో హీరోగా పరిచయం అయ్యాడు. ఇక ఈయన ఆమధ్య బిజెపిలో చేరాడు. తర్వాత బిజెపి ఏపీని మోసం చేయడంతో ఆయన ప్రత్యేకహోదా సాధన సమితిలో క్రియాశీలకంగా ఉన్నాడు. ఈయన వ్యాఖ్యలు ఎంతో పౌరుషంగా, మొహాన కొట్టినట్లు ఉంటాయి. ఈయనకి రాజకీయ పరిజ్ఞానం కూడా బాగానే ఉందని అర్ధమవుతోంది. ఇటీవల ఆయన ఓ జాతీయ పార్టీ దక్షిణాదిలో 'ఆపరేషన్ ద్రవిడ, ఆపరేషన్ రావణ, ఆపరేషన్ కుమార' వంటి వాటిని 4800 కోట్లతో అమలు చేస్తూ దక్షిణాదిన పాగా వేయాలని భావిస్తోందని చెప్పడం సంచలనం సృష్టించింది. ఇందులో ఆయన పేర్లు చెప్పకపోయిన బిజెపి, పవన్, జెడీ లక్ష్మీనారాయణ, టిడిపి చంద్రబాబు, వైసీపీ జగన్‌ల గురించి ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడని అర్ధమవుతోంది. ఇక మోదీ ప్రస్తుతం తనను కాదన్న వారిని ఐటీ, సిబిఐ ద్వారా బెదిరింపులకు దిగుతున్నాడు. కానీ ఎప్పుడైతే శివాజీ ఈ ఆపరేషన్ ద్రవిడ చెప్పాడో... అది నిజమైనా కాకపోయినా వచ్చే ఎన్నికల్లో మరలా గెలిస్తే తప్ప మోదీ ఎవ్వరిపైనా కక్ష్య సాధించలేడు. ఇప్పుడు ఏమి జరిగినా, రజనీకాంత్ నుంచి పవన్ వరకు ఏమి జరిగినా, చంద్రబాబుపై కేసులు తిరగదోడిన కూడా అవి కక్ష్యసాధింపు కిందనే ప్రజల్లో నోటెడ్ అవుతాయి. అలా శివాజీ చెప్పిన ఆపరేషన్ వల్ల బిజెపి ఆత్మరక్షణలో పడిన మాట వాస్తవం.
ఇక శివాజీ చెప్పిన ఆపరేషన్ ద్రవిడను ఉండవల్లి అరుణ్‌కుమార్ ఓ జానపద కథతో పోల్చాడు. దానిపై శివాజీ మండిపడ్డాడు. ఏ ఇద్దరు కలిసి ఉన్నా ఉండవల్లి సహించలేరని, ఆయన్ను ఎన్నో ఏళ్లుగా గమనిస్తున్నానని అన్నారు. ఏదో ఒకవైపు ఉండి ఎదుటి వారిపై ఆరోపణలు, నిందలు వేస్తుంటారని, ఎవ్వరినీ ప్రశాంతంగా ఉండనివ్వని మనస్తత్వం ఉండవల్లిది. వాటి ద్వారా ఆయన బెనిఫిట్ పొందాలని యోచిస్తుంటాడు. ఆయన చెబితే అది భగవద్గీత..మేము చెబితే పిచ్చిమాటలా? నేనేమీ నేను చెప్పింది ఉండవల్లి నమ్మాలని చెప్పలేదే? మధ్యలో ఆయనకి ఉలుకెందుకు? నాలుగురోజులకు ఒకసారి ఉండవల్లి రాజమండ్రిలో ప్రెసమీట్లు పెడుతుంటాడు. ఆయనకు యూట్యూబ్ చానెల్ ఉందేమో? అని కొందరు ఆయనపై వ్యంగ్యాస్త్రాలు కూడా విసిరారు. మీ బెనిఫిట్స్ కోసం ప్రజలను కన్‌ఫ్యూజ్ చేస్తే ఎలా? నాకు బెనిఫిట్స్ మీద ఆశ ఉండి వుంటే బిజెపి నుంచి బయటికి వచ్చేవాడిని కాను. నన్ను కెలికితే పోలవరం గురించి ఉండవల్లి మాట్లాడిన మాటలన్నీ వీడియోలలో చూపిస్తాను. నేను ప్రశాంతంగా రాష్ట్రం కోసం పనిచేస్తున్నాను. నన్ను కెలకవద్దని ఆయన ఉండవల్లిని హెచ్చరించాడు. మొత్తానికి జనసేన వైపు ఉండవల్లి ఉంటే కాస్త కుల ప్రభావమో లేక నిజాయితీతోనో తెలియదు గానీ శివాజీ మాత్రం టిడిపి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ జనసేన వారిని టార్గెట్ చేస్తున్నాడని అనిపిస్తోంది.