Advertisementt

ఇంత రహస్యం ఏమిటి ఇల్లీబేబీ!

Tue 27th Mar 2018 06:53 PM
ileana,andrew,kneebone,hubby  ఇంత రహస్యం ఏమిటి ఇల్లీబేబీ!
Ileana speaks about her hubby ఇంత రహస్యం ఏమిటి ఇల్లీబేబీ!
Advertisement
Ads by CJ

మీడియా మీపెళ్లెప్పుడు? ఆల్‌రెడీ ప్రేమలో ఉన్నారట కదా...! మరి ఎప్పుడు వివాహం చేసుకుంటారు? అనే వార్తలు వింటే నటీనటులకు మరీ ముఖ్యంగా హీరోయిన్లకు ఎక్కడో మండుతుంది. మా పెళ్లి మా ఇష్టం. దానిని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు మా పర్సనల్‌ విషయాలు మీకు చెప్పాలి? అంటూ నానా మాటలు అంటారు. కానీ ఇందులో మీడియా చెప్పే పలు విషయాలు గతంలో కూడా ఎన్నో విషయాలలో నిజం అయ్యాయి. ఇక తాజాగా నాగచైతన్య-సమంత నుంచి విరాట్‌కోహ్లి-అనుష్కశర్మ, తాజాగా నయనతార-విఘ్నేష్‌శివన్‌, శృతిహాసన్‌- మైఖేల్‌ కోర్స్‌లే, దీపికా పడుకొనే -రణవీర్‌ సింగ్‌ వంటివి నిజమని తేలుతున్నాయి. ఈ కోవలోకి గోవాబ్యూటీ, నడుం సుందరి, నాభి అందాల సైజ్‌జీరో భామ ఇలియానా కూడా చేరింది. ఈమె ఆస్ట్రేలియాకి చెందిన ఫొటోగ్రాఫర్‌ అండ్రూ నీబ్రోన్‌ని ఇప్పటికే వివాహం చేసుకుందని మీడియా ఎప్పటి నుంచో బల్లగుద్ది చెబుతోంది. కానీ ఇల్లిబేబీ మాత్రం అవసరమైనంత వరకు మాత్రమే నా పర్సనల్‌ విషయాలు చెబుతాను గానీ అంతకు మించి చెప్పను అని చెప్పింది. ఇక కొంతకాలం కిందట నా భాగస్వామిలాగా మీరు కూడా మీకు తగిన మంచి భాగస్వాములను ఎంచుకోండి అని, హబ్బీ అంటూ ఆయన తనని తీసిన పలు ఫొటోలను మీడియాలో పోస్ట్‌ చేసింది. 

ఇక తాజాగా ఈమె ఇన్‌డైరెక్ట్‌గా తమకు వివాహం జరిగిన విషయాన్ని చెప్పడంతో మరోసారి మీడియా చెప్పిన విషయం నిజమేనని నిరూపితం అయింది. తాజాగా బాలీవుడ్‌లో 'రైడ్‌' చిత్రంతో ఓకే అనిపించుకున్న ఇల్లీబేబీ నా భర్త అండ్రూ నోబ్రోన్‌ 'దిబెస్ట్‌'అని కాంప్లిమెంట్‌ ఇచ్చింది. కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్న తనను అండ్రూ ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటున్నాడని, వంటలు కూడా తానే చేసి తనకు పెడుతున్నాడని తెలిపింది. 'ఆరోగ్యం బాగా లేనప్పుడు నా భర్తే నన్ను దగ్గరుండి చూసుకుంటున్నారు. మా ఆయన బెస్ట్‌ అని చెబుతూ, తన భర్త వంట చేస్తున్న ఓ ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఇక గత ఏడాది ఇలియానా, ఆండ్రూలు... అండ్రూకి చెందిన ఆస్ట్రేలియాలోనే పెళ్లి చేసుకుని ఒకటయ్యారని, కానీ తన సినీ కెరీర్‌ దృష్ట్యా దీనిని వారు రహస్యంగా  ఉంటున్నారని తెలిపింది. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లిపై ఇప్పటికీ ఇలియానా గానీ అండ్రూ గానీ అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం.

Ileana speaks about her hubby:

Actress Caught Once Again In Social Media  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ