Advertisementt

మహామహులే కూలిపోయారు.. ఆఫ్ట్రాల్‌ వీరెంత?

Mon 26th Mar 2018 05:48 PM
prakash raj,bjp,government,modi  మహామహులే కూలిపోయారు.. ఆఫ్ట్రాల్‌ వీరెంత?
Prakash Raj Warns BJP Government మహామహులే కూలిపోయారు.. ఆఫ్ట్రాల్‌ వీరెంత?
Advertisement
Ads by CJ

ప్రపంచంలోనే నియంతలుగా పేరొందిన హిట్లర్‌ నుంచి ఔరంగజేబులు, టిప్పుసుల్తాన్‌లే మట్టి కలిసిపోయారు. యుద్దం, నియంతృత్వం, ప్రపంచాన్ని మొత్తాన్ని జయించాలని చూసిన 'అలెగ్జాండర్‌, సామ్రాట్‌ అశోక్‌లే మనసు మార్చుకున్నారు. నియంత ధోరణి చూపించి ఎమర్జెన్సీ తెచ్చి సిక్కులకు వ్యతిరేకంగా ప్రవర్తించిన ఇందిరాగాంధీ అదే సిక్కు బాడీగార్డ్‌ల చేతిలోనే హత్యకావించబడింది. ఇతరదేశాల వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోరాదన్న మన రాజ్యాంగ నిబంధనలను వదిలి, శ్రీలంకలోని మన తమిళుల మీదనే మన సైనికులతో జరిపిన హత్యాకాండ, ఎల్టీటీటీఈ ప్రభాకరన్‌ని శ్రీలంకకి పట్టించేలా చేయాలని చూసిన రాజీవ్‌గాంధీ అదే ఎల్టీటీటీఈ చేతిలో హతమయ్యాడు. హిట్లర్‌ వంటి వాడే మట్టి కరిచిపోయాడు. రాజ్యాలు పోయాయి.. వారి స్మారక చిహ్నాలు నేలకూలి మట్టిలో కలిసి పోయాయి. మరి ఆఫ్ట్రాల్‌ మోదీ ఎంత? ఇది పచ్చినిజం... నేడు మోదీ, అమిత్‌షాలు చేస్తోన్న నియంతృత్వ పాలన చూస్తే నిజమైన బిజెపి వాదులు కూడా బాధపడతారు. వాజ్‌పేయ్‌ ఎలా ఉన్నాడో ఎవ్వరికీ తెలియదు. మర్యాదపూర్వకంగా మోదీకి రెండు చేతులతో నమస్కరించిన అద్వానీనీ మోదీ అవమానించిన తీరు ఘోరాతిఘోరం. రెండు సీట్ల పార్టీని తన రథయాత్ర ద్వారా దేశవ్యాప్తంగా విస్తరింపజేసిన అద్వానీ పట్ల మోదీ ప్రవర్తించిన తీరు సంస్కార హీనం. 

ఇక విషయానికి వస్తే దాదాపు ఇవే అభిప్రాయలను గత కొంతకాలంగా మోదీ ప్రభుత్వంపై మండిపడుతున్న ప్రకాషరాజ్‌ చేశాడు. ఆయనకు అత్యంత సన్నిహితురాలైన గౌరీ లంకేష్‌ హత్య జరిగిన నాటి నుంచి ఆయన మోదీ లక్ష్యంగా విసుర్లు వేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన హిట్లర్‌ వంటి వాడే నేలకూలాడు. మోదీ, బిజెపి ఎంత? సర్వదిక్కార ధోరణి కొంత కాలం మాత్రమే పనిచేస్తుంది. ఎంతో కాలం పనిచేయదు. ఆఫ్ట్రాల్‌ మోదీ, బిజెపి ఎంత? మేము అధికారంలోకి వస్తే గంగానదిని పరిశుభ్రం చేస్తామని బిజెపి మాట ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమేర పనులు చేసి చేతులు దులుపుకుంది. మతతత్వాన్ని పోషిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆయన మండిపడ్డాడు. ఆయన చెప్పింది అక్షరసత్యం. నిజమైన బిజెపి వాదులు కూడా వచ్చే ఎన్నికల్లో కూడా మోదీనే వస్తే దేశానికి ఎంత నియంతలా మారుతాడో అని భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో యూపీఏ, కమ్యూనిస్ట్‌లే కాదు.. ఏ ప్రాంతీయ పార్టీ కూడా బిజెపిని వచ్చే ఎన్నికల్లో నమ్మేస్థితిలో లేదు. ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలని, సమాజం గురించి పోరాడుతున్న వారిని, సామాజిక అంశాలపై గళం విప్పుతున్న వారి పట్ల మోదీ చేస్తున్న అకృత్యాలు, ఐటి, సిబిఐలను దుర్వినియోగం చూస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈయనను చూస్తే ఎవరైనా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తారు. అందుకే ప్రకాష్‌రాజ్‌ లాంటి మంచి వాయిస్‌ వినిపించే వారిని కాంగ్రెస్‌ తరపున రాజ్యసభకి పంపాలని పలువురు కాంగ్రెస్‌ని కోరుతున్నారు.

Prakash Raj Warns BJP Government:

Prakash Raj Sensational Comments on Modi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ