Advertisementt

భరత్ సాంగ్ లోనే హామీ ఇచ్చేశాడు..!

Mon 26th Mar 2018 04:55 PM
bharat ane nenu,mahesh babu,song,rama jogayya sastry,devi sri prasad  భరత్ సాంగ్ లోనే హామీ ఇచ్చేశాడు..!
Bharat Ane Nenu Song Report భరత్ సాంగ్ లోనే హామీ ఇచ్చేశాడు..!
Advertisement
Ads by CJ

తొలిసారిగా ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ చేస్తున్న చిత్రం 'భరత్ అనే నేను'. ఈ సినిమాలో మొదటి సాంగ్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘విరచిస్తా నేడే నవశకం-నినదిస్తా నిత్యం జనహితం' అంటూ సాగే ఈ పాట తన చక్కని పదాలతో రామజోగయ్య శాస్త్రి రాశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు చాలా క్లాసికల్ గా ట్యూన్ ఇచ్చాడు.

'భరత్ అను నేను హామీ ఇస్తున్నాను' అంటూ పాట ఆద్యంతం డేవిడ్ సైమోన్ గొంతులో చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఖైదీ నెంబర్ 150 లో నీరు నీరు పాట ద్వారా ఎమోషనల్ గా టచ్ చేసిన రామజోగయ్య శాస్త్రి మరోసారి అలాంటి ఘనత ఈ పాటతో సాధిస్తారు అనిపిస్తోంది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్.. దేవి ట్యూన్..డేవిడ్ సైమోన్ గొంతు.. ఈ పాటను వేరే స్థాయికి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది.

మెలోడీగా సాగే ఈ పాట సినిమాలో ఓ కీలక సన్నివేశం వస్తుందని అంటున్నారు. మొత్తానికి భరత్ విజన్ అంటూ వదిలిన మొదటి పాట అంచనాలు నిలబెట్టుకునేలా ఉంది అని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ వరల్డ్ రికార్డును క్రియేట్ చేసింది. ఇక మరి ఈ సాంగ్ ఏ రికార్డును క్రియేట్ చేస్తుందో చూడాలి.

Click here for Bharat Ane Nenu song:

Bharat Ane Nenu Song Report:

Bharat Ane Nenu Song Review  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ