టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ చైర్ అందుకోవడానికి తహతహ లాడుతున్న హీరోయిన్ ఎవరయ్యా అంటే ఖచ్చితంగా అందరూ పూజ హెగ్డే పేరే చెబుతారు. మరి ప్రస్తుతం పూజ హెగ్డే వరుసగా ముగ్గురు స్టార్ హీరోల పక్కన ఛాన్స్ దక్కించుకుని టాప్ పొజిషన్ కి వెళ్లడమే కాదు, కాజల్, కీర్తి సురేష్, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ కి చెక్ పెట్టింది. దీనంతటికి కారణం అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం. పాప అందులో వేసిన బికినీ తోనే ఆమెకు అలాంటి ఇలాంటి ఆఫర్స్ కాకుండా స్టార్ హీరోల సినిమాలో స్టార్ డైరెక్టర్స్ తో చేసే అవకాశం దక్కిందని ఎన్నిసార్లు చెప్పినా తక్కువే.
దువ్వాడ జగన్నాథం తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చెయ్యడానికి గాను పూజ హెగ్డే కోటిరూపాయల పారితోషికం అందుకున్నది అని చాలా రోజులు ప్రచారం జరిగింది. అందులోను టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్స్ ని తన కొడుకు కోసం అడిగిన పారితోషకం ఇచ్చి బెల్లంకొండ సురేష్ తెస్తాడనే పేరుంది. అలా పూజ కోటి పారితోషకాన్ని సాక్ష్యం సినిమాతో అందుకుంటుంది. అలాగే ప్రస్తుతం ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాతోపాటు, మహేష్ - వంశి సినిమాతోపాటు, ప్రభాస్ - రాధాకృష్ణ కాంబోలలో వస్తున్న సినిమాలలో నటిస్తుంది కాబట్టి పూజ హెగ్డే తన పారితోషకాన్ని అమాంతం పెంచేసిందట.
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా కోసం అమ్మడు కోటిన్నర డిమాండ్ చేస్తుందని టాక్. మరి కేవలం ఎన్టీఆర్ సినిమాకే కోటిన్నర అడుగుతుందో లేకుంటే మహేష్, ప్రభాస్ సినిమాలకు ఇంకాస్త రేటు పెంచుతుందో తెలియదు గాని అమ్మడు మాత్రం అవకాశాలు ఉండగానే దండుకోవాలనే సూత్రాన్ని బాగా ఫాలో అవుతున్నట్లుగా మాత్రం అర్ధమవుతుంది. ఏదైనా ప్రస్తుతం పూజకున్న క్రేజ్ కి నిర్మాతలెవరు అమ్మడు అడిగిన దాన్ని కాదనకుండా ఇచ్చే ఛాన్సెస్ మాత్రం చాలానే ఉన్నాయి.