గ్రామీణ నేపధ్యం ఉన్నవారికి పెద్దలు, ఇతరుల పట్ల ఎంతో గౌరవాభిమానాలు ఉంటాయి. ముఖ్యంగా వారు ప్రతి ఒక్కరిని అండీ అని గానీ లేదా మరో మర్యాదపూర్వకంగా గానీ, లేదా ఏదైనా బంధుత్వం గానీ కలిపి మాట్లాడుతారు. పెద్దలు వస్తే లేచి నిలబడి వారికి కుర్చీని ఇస్తారు. కానీ 'రంగస్థలం 1985' అనే 1980ల కాలం నాటి గ్రామీణ నేపధ్యంలో వస్తున్న చిత్రంలో నటి, యాంకర్ అనసూయ మాత్రం తన గురువుకు అదేనండీ దర్శకునికి ఏమాత్రం గౌరవం ఇస్తున్నట్లు కనిపించడం లేదు. గురువు, కెప్టెన్ అయిన సుకుమార్ వచ్చి ఆమెతో మాట్లాడుతుంటే ఆమె మాత్రం తనదైన కాస్ట్యూమ్స్‌తో కుర్చీలో కూర్చొని పుస్తకం చేతిలో పెట్టుకుని సుకుమార్‌ని నిలబెట్టి మాట్లాడుతున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది నిజానికి సినిమా షూటింగ్‌కి సంబంధించిన విషయమే అయి ఉంటుంది కాబట్టి దీనిని లైట్‌గా తీసుకోవచ్చు. కానీ అలాంటి ఫొటోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి 'గురువు గారికి రంగమ్మత్త గురోపదేశం' అంటూ ఆ ఫోటోని ఆమె పోస్ట్ చేసింది. ఆ మధ్య ఓ పిల్లాడి సెల్‌ఫోన్ పగులగొట్టిన నేపధ్యంలో నెటిజన్ల నుంచి వచ్చిన తీవ్ర విమర్శలను తట్టుకోలేక రంగమ్మత్త సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉంది. మరలా ఆమె సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చి ఇటీవలే రంగమ్మత్తగా తన లుక్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇక 'రంగస్థలం 1985' చిత్రం విడుదలకు దగ్గర అవుతోంది. ఈ నేపధ్యంలోనే హీరో రామ్‌చరణ్ బర్త్‌డే కూడా ఈనెల 27న వస్తోంది. దాంతో ఆ రోజున 'రంగస్థలం 1985'కి సంబంధించిన కొత్త ప్రోమోతో పాటు బోయపాటి శ్రీను-రామ్‌చరణ్‌ల చిత్రం ఫస్ట్‌లుక్ లేదా టైటిల్‌ని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో మల్టీస్టారర్ చేయనున్నాడు. తాను తీసే చిత్రాలలోని వారి పుట్టిన రోజులు వచ్చినప్పుడు వారికి సంబంధించి సినిమాకి సంబంధించి ఏదో ఒకటి రిలీజ్ చేయడం జక్కన్న అలవాటు. 'బాహుబలి'కి మొత్తం అలాగే చేశాడు. మరి చరణ్ పుట్టినరోజున ఎన్టీఆర్, చరణ్‌ల కాంబోలో చరణ్‌కి సంబంధించిన ఏ విషయమైనా తెలుపుతాడో లేదో చూడాలి. మరోవైపు రామ్‌చరణ్ 'రంగస్థలం 1985' చిత్రానికి సంబంధించి ఐదు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ తెలంగాణ మాత్రం ఇంకా ఐదు షోలకు అనుమతి ఇవ్వలేదు.