ఇటీవల 'తొలిప్రేమ, ఇంటెలిజెంట్' వంటి చిత్రాల వేడుకలు కూడా ఏపీలో జరిగాయి. ఇక నాని 'కృష్ణార్జునయుద్దం' వేడుక తిరుపతిలో జరగనుందని సమాచారం. ఇటీవల రామ్‌చరణ్ నటించిన 'రంగస్థలం 1985' ఈవెంట్‌ని వైజాగ్‌లోని ఆర్కేబీచ్‌లో నిర్వహించారు. ఈ వేడుక బాగానే సక్సెస్ అయినా కూడా చిరంజీవి విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. చిరంజీవి ఏపీకి ప్రత్యేకహోదా విషయమై తన వైఖరిని తెలపాలని వేడుకకు వచ్చిన కొందరు డిమాండ్ చేశారు. ఆ డిమాండ్‌లో అర్ధముంది. ఇక టిడిపి నాయకులు సినిమా వారు ఎందుకు స్పెషల్ స్టేటస్‌పై ముందుకు రావడం లేదని, తెలంగాణ ఉద్యమ సమయంలో షూటింగ్ వద్దకు వచ్చిన తెలంగాణ వాదులకు తెలంగాణకే మా మద్దతు.. జై తెలంగాణ అని నినదించడంతో పాటు 'జైబోలో తెలంగాణ'వంటి చిత్రాలు కూడా తీశారు. వీరిలో జగపతిబాబుతో పాటు పలువురు ఏపీకి చెందిన వారే. నారాలోకేష్, బాబూ రాజేంద్రప్రసాద్ వంటి వారి వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వారు చెప్పిన వాటిల్లో కూడా పాయింట్ ఉంది. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వమని ఇండస్ట్రీ మొత్తం ఎందుకు ముందుకు రావడం లేదననేది స్పష్టంగా ఏపీని టాలీవుడ్ లైట్‌గా తీసుకుంటోందని అర్ధమవుతుంది.
మరోవైపు పవన్‌కళ్యాణ్ మాత్రం భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురుల స్ఫూర్తితో ప్రత్యేకహోదాపై ఉద్యమిద్దామని తాజాగా కూడా పిలుపు ఇచ్చాడు. మరోవైపు పవన్ అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్దమని ప్రకటించాడు. ఇలాంటి సమయంలో మిగిలిన స్టార్స్ మాత్రం మౌనంగా ఉంటున్నారు. మరోవైపు మహేష్ బావ గల్లాజయదేవ్ టిడిపి ఏపీ ఎంపీ. ప్రస్తుతం మహేష్ హీరోగా రూపొందుతున్న 'భరత్ అనే నేను' చిత్రం వేడుకను వైజాగ్‌లో నిర్వహించాలని భావిస్తున్నారు. ఇక అల్లుఅర్జున్ నటించిన 'నా పేరు సూర్య...నా ఇల్లు ఇండియా' చిత్రాల వేడుకలను కూడా వైజాగ్‌లో నిర్వహించనున్నారని తెలుస్తోంది. మరి ఈ వేడుకలు వైజాగ్‌లో జరిగితే మాత్రం ఏపీ యువతకు మహేష్, బన్నీ వంటి వారు మద్దతు తెలిపి మాట్లాడక తప్పని పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో వారు వైజాగ్‌లోనే జరుపుతారా? లేక 'ఎమ్మెల్యే'ని కర్నూల్ అనుకుని మరలా హైదరాబాద్‌లోనే జరిపినట్లు, ఈరెండు వేడుకలను ఏ శిల్పకళా వేదికలోనో గుట్టు చప్పుడుగా కానిచ్చేస్తారా? అన్నది తేలాల్సివుంది....!