నాగ చైతన్య స్పీడు మాములుగా లేదు. పెళ్లితర్వాత సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటూ షూటింగ్ ని పరిగెత్తిస్తున్న నాగ చైతన్య ప్రస్తుతం 'సవ్యసాచి' షూటింగ్ లో బిజీగా వున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో మాధవన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో కలిసి నాగ చైతన్య రొమాన్స్ చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదలై షూటింగ్ ని శరవేగంగా జరుపుకుంటుంది. ఇక నాగ చైతన్య 'సవ్యసాచి'తో పాటుగా మారుతీ దర్శకత్వంలో 'శైలజ రెడ్డి అల్లుడు' అనే సినిమాని కూడా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.
అయితే దర్శకుడు మారుతీని చైతు అభిమానులు చైతుతో మీ మూవీ ఎక్కడి వరకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారట. అయితే అభిమానులందరికి మారుతి హోల్సేల్ గా కలిపి ఒక ట్వీట్ చేశాడు. అదేమిటంటే నేను కూడా మీలాగే నాగ చైతన్యతో కలిసి సెకండ్ షెడ్యూల్ చెయ్యడానికి వెయిట్ చేస్తున్నాను. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న మా మూవీ సెకండ్ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నాము... చైతు సవ్యసాచి షూటింగ్ పనులతో బిజీగా ఉండడం వలన మా మూవీ కాస్త లేట్ అవుతోంది.. అయితే మేలో మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసే అవకాశముందంటూనే... అప్పటి వరకు వెయిట్ చెయ్యండి ప్లీజ్ అంటూ అభిమానులనుద్దేశించి ట్వీట్ చేశాడు మారుతీ.
మరి ఈ సినిమాలో శైలజ రెడ్డిగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. ఆవిడ గారి కూతురుగా, చైతూకి జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. మరి మహానుభావుడు హిట్ తర్వాత మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.