ఎవరెన్ని చెప్పినా దేశంలోని రాజకీయాలు, చట్టాలు మహిళలకు, దళితులకు అనుకూలంగా ఉన్నాయి. ఇది మంచిదే అయినా వీటిని పక్కవారిని బ్లాక్‌మెయిల్ చేయడానికి, కక్ష్యసాధింపులకు పాల్పడడానికి వాడుకుంటున్న మాట కూడా వాస్తవమే. అత్తామామలను సరిగా చూడమని కోరే భర్త మీద అలిగి గృహహింసలు, నిర్భయ చట్టాలు, కులం పేరుతో దూషించడాలు వంటి ఎన్నో బోగస్ కేసులు నమోదు అవుతూ ఉండటం దీని ప్రయోజనాలనే దెబ్బతీసే విధంగా ఉంది. నిజమైన బాధితులకు ఇవి రక్షణ ఇవ్వకపోగా వ్యతిరేకులపై కక్ష్యసాధింపులకే ఎక్కువగా ఉపయోగ పడుతున్నాయి. ఓ పేద దళితుడు తమకు ఉన్న చట్టాలను ఉపయోగించుకోలేకపోతున్నాడు. కానీ కత్తి మహేష్ వంటి వారు పవన్ ఫ్యాన్స్‌తో గొడవ జరిగినా కూడా దానికి కూడా ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. ఇక తాజాగా అలనాటి బాలీవుడ్ సెక్స్‌బాంబ్, బాలీవుడ్‌లో మొదటి సెక్సీబాంబ్‌గా పేరున్న జీనత్ అమన్ తనపై అత్యాచారం, వేధింపులు జరిగాయని ముంబైకి చెందిన అమర్‌ఖాన్ అనే వ్యాపారవేత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమర్‌ఖాన్ తనపై అత్యాచారం చేయడమే కాకుండా అసభ్యకరమైన ఫొటోలు పంపుతున్నాడని ఆమె ముంబైలోని జుహూ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది.
ఇక ఈమె నాడు 'సత్యం శివం సుందరం, ఖుర్బానీ, ఆజ్‌నబీ' చిత్రాల ద్వారా దేశ యువతను ఉర్రూతలూగించింది. ఆ తర్వాత 1985 మజార్‌ఖాన్‌ని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు మగపిల్లలు. ఈమె భర్త 1998లో మరణించడంతో ఆమె తన ఇద్దరు సంతానంతో ముంబైలోని జుహూలో నివాసం ఉంటోంది. ఇక ఈమె ఫిర్యాదు చేసిన అమర్‌ఖాన్ జీనత్ అమన్ ఫ్యామిలీకి క్లోజ్‌ఫ్రెండ్. ఇరు కుటుంబాల మధ్య ఆర్ధిక స్పర్దలు వచ్చాయి. గత కొంతకాలంగా వీటిని రాజీ చేసుకునే ప్రయత్నంలో అమర్‌ఖాన్ ఉన్నాడు. దాంతో ఆయన తాజాగా ఆమెని తమ ఇంటికి ఆహ్మానించి చర్చలు జరుపుదామని పిలిచాడట. దాంతో జీనత్ ఆయన ఇంటికి వెళ్లగా ఆయన అసలు ప్రవర్తన అక్కడ బయటపడిందని, తనపై అత్యాచారం చేయడమే కాదు... పలు విధాలుగా వేధించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అమర్‌ఖాన్‌ని అదుపులోకి తీసుకున్నారు. అమర్‌ఖాన్ మీద జీనత్ అమన్ జనవరిలోనే పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. కానీ అందులో కేవలం వేధింపులని మాత్రమే ఆమె పేర్కొంది. ఇప్పుడు మాత్రం ఆమె రేప్ కేసును కూడా పెట్టడంతో దీనిపై అందరిలో చర్చ జరుగుతోంది. ఏది నిజమో.. ఏది కాదో తెలియని పరిస్థితుల్లో అందరు ఉండటం విశేషం.