ప్రజారాజ్యం పార్టీలో చేరి తప్పు చేశానని, దానివల్ల తనకు నువ్వు కాపోళ్లకు సపోర్ట్ చేయడం ఏమిటి? అనే విమర్శలు వచ్చాయని, చిరంజీవి సీట్లు అమ్ముకున్న మాట వాస్తవం కాదని, కానీ ఆయన రాజకీయంగా విఫలమయ్యాడని పోసాని ఎన్నోసార్లు చెప్పాడు. ఇక ఇటీవల పవన్ తనను జనసేన పార్టీలోకి ఆహ్వానించి సీటు ఇస్తానన్నా వెళ్లనని, తాను ఈ సారి మాత్రం ఖచ్చితంగా జగన్‌కే ఓటు వేస్తానని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పరిపాలన చూసి మరోసారి ఓటు వేయాలా? లేదా? అనేది ఆలోచిస్తానని పోసాని కుండబద్దలు కొట్టాడు. అదే ఈయన ఒకనాడు టిడిపిని గెలిపించాలని, చంద్రబాబుకి ఎందుకు ఓటు వేయాలో చెబుతూ, ప్రతి పత్రికలో ఫుల్‌పేజీ యాడ్స్‌ని తనసొంత ఖర్చుతో చేశాడు. ఇక ఇటీవల ఈయన మాట్లాడుతూ, చంద్రబాబులో ఒకప్పుడు ఉన్న డైనమిజం ఇప్పుడు లేదని, అప్పుడు ఆయన ఏదైనా సమస్య తనదాకా వస్తే దాని అంతుచూడకుండా వదిలే రకంగా కాదని, కానీ నేడు మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాలకు అలవాటు పడి ఏ పని చేస్తే ఎవరి ఓట్లు వస్తాయి? ఎవరికి చేస్తే ఏం లాభం? వంటివి ఆలోచిస్తున్నాడని తెలిపాడు. ఇక తాజాగా ఆయన పవన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ డబ్బు మనిషి అని తాను భావించడం లేదని, ఆయన ఈరోజు సినిమా చేస్తానని అంటే ఎందరో నిర్మాతలు బ్లాంక్ చెక్కులు ఇచ్చి, ఇష్టమొచ్చినన్ని సున్నాలు వేసుకున్నా అభ్యంతరం చెప్పరన్నాడు. అంతెందుకు నాకే కాల్షీట్స్ ఇస్తే నేను కూడా ఖాళీ చెక్ ఇచ్చి ఎంత రాసుకున్నా ఓకే చెబుతానని తెలిపాడు.
ఇక పవన్ చంద్రబాబుతో సఖ్యతగా ఉండి వుంటే ఆయన తాను అనుకున్నది ఏదైనా ఒకే ఒక్క ఫోన్‌కాల్‌తో చేయించుకోగలిగిన సత్తా ఉన్న వ్యక్తి. ఆయన డబ్బులకు లొంగే రకమైతే ఇప్పటికీ చంద్రబాబుతో స్నేహంగా ఉండేవాడు. కానీ ఆయన బహిరంగ సభలో టిడిపిపై విమర్శలు చేశాడంటే ఆయన మాటల్లో ఎంతోనిజం ఉందనేది తన అభిప్రాయంగా చెప్పాడు. ఆయన్ను ప్యాకేజీ స్టార్ అనడాన్ని నేను ఒప్పుకోను. ఆయన రెండెకరాలలో కాదు.. రెండు వందల ఎకరాలలో అయినా ఆఫీస్, ఇల్లు కట్టుకునే సత్తా ఆయనకు ఉంది. ఇక పవన్ ప్రత్యేకహోదా కోసం నిరాహార దీక్ష చేస్తే నేను కూడా మద్దతు ఇస్తాను. కానీ అందరు మౌనంగా ఉన్నారు. దోచుకున్న వారు హాయిగా ఉన్నారు. మరి పవన్‌ని మాత్రం రెచ్చగొట్టి నిరాహారదీక్షకు కూర్చొనేలా పురికొల్పుతున్నారు. దీక్ష పేరుతో పవన్‌ని చంపడానికి ప్లాన్ చేశారా? ఆయన ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, సీఎం? ఏది కాదు కదా..!ఆయనను ప్రోత్సహించి దీక్షకు కూర్చోబెట్టి చంపుతారు. ఐలవ్‌యు నాన్నా...నువ్వు దీక్షలో కూర్చోవద్దు. అందరు దీక్షలో కూర్చుంటేనే నువ్వు కూడా కూర్చోవాలి. అప్పుడు నేను కూడా దీక్షలో పాల్గొంటానని ఓపెన్‌గా సంచలన వ్యాఖ్యలు చేశాడు.