Advertisementt

ఉపాసనకి అందరూ కావాలి..!

Fri 23rd Mar 2018 11:39 PM
ram charn,upasana,mahesh babu,daughter sitara,pic,social media  ఉపాసనకి అందరూ కావాలి..!
Upasana shares a pic with her little Bestie ఉపాసనకి అందరూ కావాలి..!
Advertisement
Ads by CJ

అపోలో హాస్పిటల్స్‌కి అధిపతి, వారసురాలు హోదాలోనే గాక పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో, తన భర్త రామ్‌చరణ్‌కి సంబంధించిన అప్‌డేట్స్‌, ఫ్యామిలీ సంగతులను కూడా మెగా కోడలు ఉపాసన ఎంతో యాక్టివ్‌గా సోషల్‌మీడియాలో పాల్గొంటూ ఫొటోలను కూడా పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. రామ్‌చరణ్‌కి అంత సమయం ఉండదు కాబట్టి అభిమానులకు అన్ని విషయాలను తెలిపి సంతోషింపజేసే పాత్రను ఉపాసన కొణిదెల తీసుకుంది. ఈ విషయంలో ఆమెకి మెగాభిమానుల్లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఇక మెగా ఫ్యామిలీకి చెందిన రామ్‌చరణ్‌, ఘట్టమనేని ఫ్యామిలీకి చెందిన మహేష్‌బాబులు ఎంతో క్లోజ్‌. వీరి మధ్య మంచి బాండింగ్‌ ఉంది. గతంలో మహేష్‌ విదేశీ ట్రిప్‌లో వెకేషన్స్‌లో ఉండగా అక్కడ రామ్‌చరణ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఇలా పలుసార్లు జరిగింది. వీరిద్దరి బంధం గురించి నాడు చిరంజీవి కూడా ఎన్నో సంగతులను చెప్పుకొచ్చాడు. 

ఇక ఇప్పుడు రామ్‌చరణ్‌-మహేష్‌బాబుల బాండింగ్‌ రామ్‌చరణ్‌ శ్రీమతి ఉపాసన, మహేష్‌ గారాల పట్టి సితార మధ్య కూడా బాగా ఏర్పడిందని తాజా ఫొటోలు చూస్తే అర్ధమవుతుంది. ఓ ప్లేగ్రౌండ్‌లో ఇల్లు వంటి సెట్‌ వద్ద సితార, ఉపాసనలు కలిసి ఓ ఫొటోకి ఫోజ్‌ ఇచ్చారు. దీనిని ఉపాసన సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. 'విత్‌ మై బెస్టీ సితార' అని అంటే తన బెస్ట్‌ ఫ్రెండ్‌తో కలిసి దిగిన ఫొటో అని ఉపాసన తెలియజేసింది. ఈ ఫొటోకి ట్విట్టర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీమైన వ్యూస్‌, లైక్స్‌ వస్తున్నాయి. మెగా-ఘట్టమనేని ఫ్యామిలీల బాండింగ్‌ ఇదని, రామ్‌చరణ్‌-మహేష్‌ అయినా, ఉపాసన - సితార అయినా సరే అదే నిరూపితం అవుతోంది. ఒకవైపు తన భర్త రామ్‌చరణ్‌, మావయ్య చిరంజీవిలతో పాటు సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకి సంబంధించిన విషయాలను కూడా ఉపాసన అభిమానులతో పంచుకోవడంతో మహేష్‌ ఫ్యాన్స్‌ కూడా ఈ ఫొటోని, ఉపాసనని ఎంతో అదరిస్తున్నారు.

Upasana shares a pic with her little Bestie:

Ram Charan's wife Upasana with Mahesh Babu's Daughter Sitara

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ