మహానటి సావిత్రి అంటే ఇష్టపడని వారుండరు. ఆమె హావభావాలు, ఆమె నటనకు, ఆమె అందానికి అందరూ ఫిదానే. అలనాటి మేటి నటిగా సావిత్రి తర్వాతే ఎవరైనా అన్నట్టుగా ఆమె కీర్తింపబడింది. అలాంటి సావిత్రి జీవిత చరిత్రను కుర్ర దర్శకుడు నాగ్ అశ్విన్, అశ్వినీదత్ కూతురు స్వప్న దత్ ప్రొడక్షన్ లో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో మహానటిగా కీర్తి సురేష్ నటిస్తోంది. సమంత, దుల్కర్ సల్మాన్ వంటి నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇకపోతే మహానటి సావిత్రి ఈ నెల 30 న విడుదలవ్వాల్సి ఉండగా... కొన్ని పనుల కారణంగా మే 9 కి షిఫ్ట్ అయ్యింది ఈ చిత్రం. అయితే మొదటి నుండి ఈ సినిమాపై భారీ అంచనాలున్నప్పటికీ ఇప్పుడు ఈ సినిమాపై క్రేజ్ రోజురోజుకి పడిపోతోందని టాక్ వినబడుతుంది.
అదేమిటంటే చిత్ర బృందం ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆ సినిమాలోని పిక్స్ గాని న్యూస్ గాని ఏదో ఒక రకంగా లీకవుతుంది. మొన్నటికి మొన్న కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ ల సావిత్రి, జెమిని గణేశన్ ల లుక్ లీకైంది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఆ పిక్ పై కొందరు పాజిటివ్ గా స్పందిస్తే.. మరికొందరు నెగెటివ్ గా స్పందించారు. మరో పక్క షూటింగ్ లొకేషన్ లో సమంత తనకు తానుగా ఒక సింపుల్ శారీ లుక్ ని పోస్ట్ చేసింది. అలా సినిమాపై ఎంతగా జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఇలా ఎదో ఒకటి లీకై దర్శకుడు నాగ అశ్విన్ కి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.
మరోపక్క సమంత ఈ సినిమాలో ఎలాంటి రోల్ చేస్తుందో అనేది బయట పెట్టకుండా సస్పెన్స్ చేస్తుంటే... సమంత మాత్రం ఒక నేషనల్ మీడియాకి రంగస్థలం ఇంటర్వూస్ ఇస్తూ.. మాటల్లో మాటగా తాను మహానటిలో జర్నలిస్ట్ పాత్రను చేస్తున్నట్టుగా రివీల్ చేసేసింది. అంటే ఈ సినిమాలో సమంత పాత్రకి పెద్దగా స్కోప్ లేదనేది అర్ధమవుతోంది. తన పాత్ర ద్వారానే సావిత్రి కథ రివీల్ అవుతుందని సమంత తన పాత్రని ఓపెన్ చేసేసింది. మరి ఇలా మహానటి సంగతులు బయటపెట్టేస్తుంటే ఆ సినిమాపై ఇంకేం క్రేజ్ ఉంటుంది అంటున్నారు.