సినిమా తారల పిల్లలు ఏం చేసినా అది భలే ముద్దుగా ఉంటుంది. అందులో స్టార్ హీరోస్ పిల్లలైతే అది ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. మరి ఆ హీరోల అభిమానులు తమ హీరో గారి పిల్లలు అలా చేస్తుంటే కాబోయే సూపర్ స్టార్స్ అంటూ వాళ్ళను కూడా అభిమానిచ్చేస్తుంటారు. ఎన్టీఆర్ వాళ్ళ అబ్బాయి అభయ్ రామ్ ఆడుకున్న సెన్సేషనే, మహేష్ పిల్లలు గౌతమ్, అండ్ సితారలు కలిసి ఫోటో దిగినా సెన్సేషనే. అలాగే అల్లు అర్జున్ కొడుకు అల్లు ఆయన్, కూతురు అర్హలు అల్లరి చేసిన సెన్సేషన్. మొన్నామధ్యన దువ్వాడ జగన్నాధం ప్రి రిలీజ్ ఈవెంట్ లో అల్లు ఆయాన్ అయితే అభిమానులకు చేసిన అభివాదం సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యిందో తెలిసిందే.
తాజాగా అల్లు ఆయన్ బుల్లి చిట్టి బాబుగా రచ్చ చేస్తున్నాడు. రామ్ చరణ్ తాజా చిత్రం రంగస్థలంలో రామ్ చరణ్ చిట్టిబాబుగా అదరగొడుతున్నాడు. సౌండ్ ఇంజినీర్ గా చిట్టిబాబు మాస్ లుక్ లో లుంగి కట్టుకుని గెడ్డం పెంచేసి రఫ్ అండ్ టఫ్ గా ఒక తుండు వేసుకుని అందరిని ఆకట్టుకున్నాడు. మరి లుంగీ, గుండీలు లేని చొక్కా... భుజం మీద తువ్వాలు వేసుకుని మాస్ ఫోజు పెట్టిన రామ్ చరణ్ లుక్ అందరిని ఆకర్షిస్తుండగా... ఇప్పుడు మెగా ఫ్యామిలీ పిల్లోడు అల్లు ఆయన్ మావయ్య రామ్ చరణ్ లా లుంగీ కట్టి తుండు వేసుకుని గళ్ళ చొక్కాతో ఇచ్చిన ఫోజ్ ఉంది చూడండి అబ్బబ్బ బుల్లి అయాన్ ఇప్పుడు బుల్లి చిట్టిబాబు లుక్ లో ఇరగదీస్తున్నాడు అని అనిపిస్తుంది.
అల్లు ఆయన్ చిట్టిబాబు లుక్ మాత్రం మెగా అభిమానులను విపరీతంగా ఆకర్శించేస్తుంది. నిజంగా రామ్ చరణ్ ఎలాంటి ఫోజ్ లో నిలబబడ్డాడో అల్లు ఆయన్ కూడా అదే ఫోజ్ లో నిలబడి ఆకట్టేసుకుంటున్నాడు. మరి మీరు బుల్లి చిట్టిబాబు అయాన్ ని చూసి పండగ చేసుకోండి.