మనసుకు అనిపించింది మాట్లాడటం, ఎదురుగా ఎవరు ఉన్నారు? వినేవారు, చూసేవారు ఏమనుకుంటారనే భయం లేకుండా తిట్టడంలోనైనా, నచ్చితే పొగడటంలో అయినా ముందుండే వ్యక్తుల కోవలోకి విలక్షణ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి వస్తాడు. ఇక ఈయన తాజాగా టిడిపి ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌ని చీల్చిచెండాడాడు. బాబు రాజేంద్రప్రసాద్ తెలుగు దేశం పార్టీ వారంతా ప్రత్యేకహోదా గురించి పోరాటం చేస్తుంటే సినీ పరిశ్రమకి చెందిన వారు మద్దతు ఇవ్వడం లేదు. వారు డబ్బు మత్తులో జోగుతున్నారని వ్యాఖ్యలు చేశాడు. దీనికి తమ్మారెడ్డి భరద్వాజ ఘాటుగా సమాధానం చెప్పాడు. ఇక తమ్మారెడ్డిలో మంచి భావాలు ఉన్నా కూడా ఎవరితోనో వైరం ఎందుకు అనుకునే రకం. కానీ పోసాని ఆ టైప్ కాదు. ఆయన ఈ ఆరోపణలపై స్పందిస్తూ ఓ చర్చా కార్యక్రమంలో బాబూ రాజేంద్రప్రసాద్, నారాలోకేష్‌లపై మండిపడ్డాడు. జఘనాలు, గగనాల కొలతలు నారాలోకేష్‌కి తెలిసినంతగా సినిమా వారికి కూడా తెలియవు. ఈ కొలతల్లో నారా లోకేష్ ఎక్స్‌పర్ట్. సినిమా పరిశ్రమ వారు లోకేష్ ముందు ఈ విషయాలలో చాలా చిన్నవారు. జఘనాలపై డౌట్ ఉంటే రాజేంద్రప్రసాద్ నారాలోకేష్‌ని అడిగితే చెబుతాడు. అమ్మాయిల కొలతలు కూడా లోకేష్ బాగా తీసుకుంటాడు.
ఆయన ముందు మేము బచ్చాగాళ్ళం, మత్తులో జోగుతున్నది మేము కాదు లోకేష్‌బాబే. ఇలాంటి విమర్శలు చేసేందుకు బుద్ది ఉండాలి. అంటూ ఐటీ మంత్రి లోకేష్‌కి చెందిన పలు ఫొటోలను ఆయన చూపించారు. నిజమే.. ఇంతకాలం ఈ మాటను దైర్యంగా అనగలిగలిగిన వారు లేకుండా పోయారు. అందరికి ఇది తెలిసిన విషయమే అయినా మౌనం వహించారు. కానీ లోకేష్ గతంలోనే డ్రింక్స్ తీసుకుంటూ, లేడీస్‌తో ఎంజాయ్ చేస్తున్న పలు ఫొటోలు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక పోసాని తాజాగా 'ఎమ్మెల్యే' ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మరో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. టిడిపి నుంచి కళ్యాణ్‌రామ్ వంటి వ్యక్తులు నిజంగా ఎమ్మెల్యేలుగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ పార్టీ. ఎన్టీఆర్ వారసులుగా ఇలాంటి వారు ఉంటేనే బాగుంటుందని చెప్పడం, దానికి వంశీపైడిపల్లి కూడా మద్దతు తెలపడంతో సరికొత్త వాదన ద్వారా పోసాని ఇప్పుడు జరుగుతున్న రాజకీయ సమీకరణాలలో కొత్త వాదనకు తెరదీశాడు.