'రంగస్థలం' సినిమా రిలీజ్ కు ఇంకా 8 రోజులే ఉండటంతో చిత్ర టీం ఆన్ లైన్ ద్వారా సినిమాకు ఉన్న బజ్ ను మరింతగా పెంచేందుకు వీడియోస్ ను రిలీజ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా రంగస్థలం టైటిల్ మేకింగ్ సాంగ్ వీడియోను విడుదల చేసింది చిత్ర టీం.
ఇప్పటికే ఈ సినిమాలో రంగా రంగా రంగస్థలాన సాంగ్ ప్రోమోను చూసి మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుండగా.. ఇప్పుడు ఆ పాట మేకింగ్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ పాట షూటింగ్ గోదావరి తీరాన జాతరను తలపించేలా సెట్ వేసి అందులో షూట్ చేశారు. ఈ సాంగ్ ను ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. ఈ మేకింగ్ చూస్తుంటే డాన్స్ మాస్టర్ చెప్పిన స్టెప్స్ చరణ్ చాలా అవలీలగా చేస్తున్నట్టు అనిపిస్తుంది.
ఈ సాంగ్ కోసం టీం ఎంత కష్టపడ్డారో చూస్తే అర్ధం అవుతుంది. షూటింగ్ చూడటానికి వచ్చిన ఫ్యాన్స్ ని కంట్రోల్ చేస్తూ.. మరోపక్క సాంగ్ షూట్ చేస్తూ బాగా కష్టపడ్డారు అని అర్ధం అవుతుంది. అందుకేనేమో ఫ్యాన్స్ ని బయట అదుపుచేయలేక హైదరాబాద్ లో రంగస్థలం సినిమా కోసం జూబ్లీహిల్స్ లోని 25 ఎకరాల్లో రంగస్థలం ఊరు సెట్ వేసి మరీ షూటింగ్ జరిపించారు. ఇక మేకింగే ఇలా ఉంటే ఈ సాంగ్ థియేటర్స్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ నెల 30న చరణ్ రంగస్థలంతో మన ముందుకు రానున్నాడు.