Advertisementt

శంకర్‌ హీరోయిన్లకి ఇదే బాధ..!

Fri 23rd Mar 2018 11:08 AM
amy jackson,shankar heroine,indian films  శంకర్‌ హీరోయిన్లకి ఇదే బాధ..!
Amy Jackson not to do Indian films శంకర్‌ హీరోయిన్లకి ఇదే బాధ..!
Advertisement
Ads by CJ

ప్రతి హీరో, ప్రతి నటుడు దిగ్రేట్‌ శంకర్‌ దర్శకత్వంలో నటించాలని భావిస్తారు. కానీ మొదటి నుంచి శంకర్‌ గ్రాఫ్‌ని పరిశీలిస్తే ఆయన చిత్రాలు ఎంత పెద్ద హిట్‌ అయినా కూడా ఆయా హీరోయిన్లకు మాత్రం పెద్దగా పేరు, అవకాశాలు రావు. హీరోలతో పోలిస్తే శంకర్‌ది హీరోయిన్ల విషయంలో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే. ఉదాహరణకు 'అపరిచితుడు' తర్వాత ఇప్పటివరకు సదాకి హిట్‌ లేదు. ఫేడవుట్‌ కూడా అయిపోయింది. ఇలాంటి కోవలోకే ఇప్పుడు కెనాడా సుందరి ఎమీజాక్సన్‌ వస్తోంది. ఈమె వరుసగా శంకర్‌తో విక్రమ్‌ హీరోగా రూపొందిన 'ఐ', రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌లతో తెరకెక్కుతున్న '2.0'లలో చాన్స్‌లు సాధించింది. ఇక ఈమె 'ఎవడు' ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. గ్లామర్‌షోకి ఏమాత్రం అడ్డుచెప్పని ఈ భామ '2.0'పై ఎన్నో నమ్మకాలు పెట్టుకుంది. 

'బాహుబలి'ని తిరగరాసే సత్తా ఉన్న ఇండియాలోనే హైయ్సెస్ట్‌ బడ్జెట్‌తో, దేశంలోని అన్ని భాషల్లోనే కాదు.. విదేశాలలో కూడా విడుదల కానున్న '2.0' చిత్రం రిలీజ్‌ తర్వాత తాను అన్ని భాషల్లో బిజీ అవుతానని ఆశలు పెట్టుకుని ఉంది. కానీ ఈ చిత్రం విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. కొన్నేళ్లుగా షూటింగ్‌ జరుపుకుంటూ ఉండటం, విడుదల పోస్ట్‌పోన్‌ అవుతూ ఉండటంతో ఆమె విసిగిపోయిందని సమాచారం. ఇక '2.0'లో ఆమె నటిస్తోందని, ఈ చిత్రం 'సాహో' కంటే ముందే రిలీజ్‌ అవుతుందని, దాంతో 'సాహో'లో అమీజాక్సన్‌ని పెట్టుకుంటే సినిమాకి ప్లస్‌ అవుతుందని 'సాహో' యూనిట్‌తో పాటు ఎందరో భావించారు. కానీ ఈమె ఆశలు ఇప్పుడే నెరవేరే సూచనలు కనిపించకపోవడంతో ఆమె విసుగు చెంది ఆఫ్రికాలోని మొరాకోకి వెళ్లి స్థిరపడాలని, అక్కడ వచ్చే టీవీ సీరిస్‌లు, ఇతర భాషా చిత్రాలలో నటించాలని డిసైడ్‌ అయిందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎమీ మనసులో ఏముందో ఆమె బయటికి చెప్పేదాకా తెలియదు. అయినా ఇంతకాలం ఓపిక పట్టిన ఆమె మరో ఐదారు నెలలు ఓపిక పడితే ఏమైనా ఫలితం ఉండవచ్చు కదా..! అని ఆమె అభిమానులు సూచిస్తున్నారు.

Amy Jackson not to do Indian films:

Shankar’s Heroine Shocking Decision

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ