రామ్ చరణ్ షూటింగ్స్ తో బిజీగా ఉంటుంటాడు... అంత బిజీలో రామ్ చరణ్ సోషల్ మీడియాని సరిగ్గా హ్యాండిల్ చెయ్యలేడు. అందుకే ఆయన భార్య ఉపాసన మిష్టర్ సి అంటూ తన భర్త రామ్ చరణ్ విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరవేస్తూ ఉంటుంది. తాము ఎప్పుడు ఏం చేస్తున్నామో అనే విషయాలతో తరుచూ చెప్పే ఉపాసన అభిమానులకు సోషల్ మీడియాలో
చేరువుగానే ఉంటుంది. అటు తమ పుట్టింటి విశేషాలతో పాటు ఇటు మెట్టింటి విశేషాలను అందరితో పంచుకుంటుంది. అలాగే మహేష్ భార్య నమ్రత కూడా మహేష్ విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరవేస్తుంది. తన పిల్లలతో తామిద్దరూ గడిపిన అద్భుతమైన క్షణాలను కూడా నమ్రత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
ఇక మంచు లక్ష్మి తన పాప విద్య నిర్వాణ గురించి తన తండ్రి మోహన్ బాబు తమ్ముళ్ల గురించిన కబుర్లతో సోషల్ మీడియాకి చేరువగానే ఉంటుంది. అలాగే నారా బ్రాహ్మణి కూడా అంతే. మరి వీళ్లంతా ఒకే చోట కలిస్తే అభిమానులకు పండగే పండగ. నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణల ముద్దుల మనవడు, లోకేష్, బ్రాహ్మణిల ముద్దులకొడుకు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఉపాసన, లక్ష్మి మంచు, నమ్రత, బ్రాహ్మణిలు కలిసి ఫొటోస్ దిగడంతో ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక ఆ పిక్స్ చూసిన అభిమానులకు పండగే పండగ.
ఉపాసన, మహేష్ కూతురు సితారతో కలిసి దిగిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉపాసన. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఉపాసన, సితారలు కలిసి ఒకే చోట కూర్చుని దిగిన ఫోటోని ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నా బెస్టీతో అంటూ ట్యాగ్ చేసింది. మరి ఆ ఫోటో చూసిన మెగా, ఘట్టమనేని అభిమానులకి పండగ మాత్రమే కాదు.. చూపరులను కూడా ఆ ఫోటో అంతలా ఆకర్షిస్తుంది.
అలాగే లక్ష్మి మంచు, ఉపాసన, బ్రాహ్మణి, నమ్రతలు కలిసి ఒకే ఫ్రెమ్ లో దేవాన్ష్ బర్త్ డే సందర్భంగా దిగిన పిక్స్ కూడా అదుర్స్ అనేలా ఉన్నాయి. మరి దేవాన్ష్ నిన్న తన పుట్టినరోజు సందర్భంగా పొద్దున్న తిరుపతిలో దేవదేవుణ్ణి సందర్శించుకుని.. సాయంత్రానికల్లా హైదరాబాద్ లో వాలిపోయి పుట్టినరోజు వేడుకల్ని ఒక రేంజ్ లో జరిపేసుకున్నాడన్నమాట.