సినిమా వారిని తక్కువగా అంచనా వేయకండి. వారు రాజ్యాలనే పాలిస్తారు అని జార్డ్ బెర్న్‌డ్‌షా ఏనాడో చెప్పాడు. ఓ నటుడు అమెరికన్ ప్రెసిడెంట్ కావడం, ఇక భారతదేశంలో కూడా ఎన్టీఆర్, ఎమ్జీఆర్ వంటి వారు రాష్ట్రాన్ని, దేశాన్ని శాసించారు. ఇక ఆ తర్వాత జయలలిత కూడా తన తడాఖా చూపింది. ఇన్ని జరుగుతున్నా కూడా ఇప్పటికీ సినిమా వారు రాజకీయాలలోకి వస్తున్నారంటే చాలు... ముఖానికి రంగులేసుకునే వారికి రాజకీయాలేం తెలుసు. ఇదంతా రెండు గంటల చిత్రంకాదు.. అంటూ విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్, ఎమ్జీఆర్‌ల మీద కూడా ఇలాంటి నెగటివ్ వ్యాఖ్యలే వచ్చాయి. ఇక ఇటీవల 'పద్మావతి' చిత్రం చర్చలో పాల్గొన్న బిజెపి ఎమ్మెల్యే, రాజ్‌కర్ణిసేన నాయకుడు రాజాసింగ్ సినిమా నటీమణులు మగాళ్లను పరుపులు మార్చినట్లు మారుస్తారని వ్యాఖ్యానించాడు. దాంతో అదే చర్చలో పాల్గొన్న తమ్మారెడ్ది భరద్వాజ ఇలాంటి వారు ప్రజా ప్రతినిధులు కావడం మన దురదృష్టం. ఇలాంటి బజారు వ్యక్తులతో మాట్లాడి నా స్థాయిని నేను తగ్గించుకోలేను. మరి బిజెపిలో కూడా పలువురు నటీమణులు ఉన్నారు కదా..! వారు కూడా అదే బాపత్తా? అని దుమ్ముదులిపేశాడు. ఇక తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ టిడిపి ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. తాజాగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ఏపీ మొత్తం ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తుంటే సినిమా వారు దానికి ఎందుకు మద్దతు ఇవ్వరు? అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా భరద్వాజ అధికారంలో ఉన్నామని ఎలా పడితే అలా వ్యాఖ్యలు చేయవద్దు. ఏపీ ఎంపీలు పార్లమెంట్‌లో చేస్తున్నది డ్రామా అనిపిస్తోంది. కేవలం రాజకీయంగా లబ్దిపొందడం కోసమే వారు ఈ పోరాటం చేస్తున్నారు. ముందుగా మీ రాజకీయ నాయకులందరూ, అన్ని పార్టీల వారు ఈ విషయంలో ఏకతాటిపైకి వస్తే పరిశ్రమ కూడా మీకు మద్దతు తెలుపుతుంది.
ఇక టిడిపిలో కూడా పలువురు సినిమా వారు ఉన్నారు. మొదట వారి చేత ప్రకటనలు ఇప్పించండి. తర్వాత మేము మద్దతు ఇస్తాం. అప్పుడు మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు ఉంటుంది? ఇక అవార్డులు రాకపోతే రచ్చ రచ్చ చేసే సినిమా వారు ప్రత్యేకహోదాని ఎందుకు ఇవ్వడం లేదని బాబు విమర్శిస్తున్నాడు. అవార్డులు మీ ఇష్టం ప్రకారమే ఇచ్చారు కదా...! ముందుగా మీరు నందులు ఇచ్చిన వారిని ప్రత్యేకహోదాపై మాట్లాడమనండి.. అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. ఇవి ఇన్‌డైరెక్ట్‌గా బాలయ్యని ఉద్దేశించే చేశాడు. ఆయన ఇప్పటి వరకు ప్రత్యేకహోదా విషయంలో నోరు విప్పలేదు. అంతేకాదు..పవన్ గురించి మాట్లాడి అతడిని హీరోని చేయనని వ్యాఖ్యలు చేశాడు. ఇక నారా లోకేష్‌పై ఆధారాలు లేకుండా ఆరోపణలను పవన్ చేయడం తప్పని భరద్వాజ ఒప్పుకున్నాడు. అయినా ఒక డౌట్ ఏమిటంటే... పవన్ నారాలోకేష్‌పై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశాడు? అని మండిపడుతున్నవారు నేడు పవన్‌ని బిజెపి కోవర్ట్‌గా, వైసీపీ అనుకూలుడిగా ఆరోపణలు చేస్తున్నారు. మరి వీటికి వారి వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయా? ఉంటే బయటపెట్టమనండి...!