మొన్నటి ఇలియానా, తాప్సిపన్ను, రకుల్‌ప్రీత్‌సింగ్ వంటి హీరోయిన్లు సౌత్‌ఇండియాలోకి వచ్చి ఇక్కడి చిత్రాలలో నటిస్తూ, భారీ పారితోషికం అందుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత ఉండటంతో వారు తాము బాలీవుడ్ నటీమణుల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ సాధిస్తున్నారు. ఇంతవరకు ఒకే.. కళకు భాషా, ప్రాంతీయబేధాలు లేవు కాబట్టి ఎవరు ఎక్కడైనా నటించవచ్చు. కానీ సౌత్‌లో సినిమాలు చేసి ఇక్కడి నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోల ప్రోత్సాహంతో చిత్రాలు చేసి తర్వాత బాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత సౌత్ గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. సౌత్‌లో తమని గ్లామర్ డాల్స్‌గా భావిస్తారని, హీరోయిన్లకు అసలు ప్రాధాన్యం ఉండదని, కేవలం గ్లామర్‌షోకే పరిమితం చేస్తారని సౌత్‌పై బాలీవుడ్ మీడియాలో నిప్పులు కురిపిస్తారు. మరి వారేమైనా బాలీవుడ్‌లో అద్భుత పాత్రలు చేస్తున్నారా? అంటే అదీ లేదు. రాఘవేంద్రరావుని సైతం బొడ్డుపై కొబ్బరి చిప్పలు వేయడంపై కామెంట్ చేసిన తాప్సి పన్ను'జుద్వా 2'లో బికినీలో కనిపించింది.
ఇక తెలుగులో 'రక్తచరిత్ర, లయన్, లెజెండ్, కబాలి' వంటి చిత్రాలలో నటించిన రాధికా ఆప్టేకి కూడా ఇదే వరస. తాను ఓ సౌత్‌ఇండియన్ స్టార్‌తో పనిచేసే సమయంలో కాస్టింగ్‌కౌచ్‌తో ఇబ్బంది పడ్డాడని, ఆ హీరో రాజకీయ నాయకుడు కూడా అంటూ హింట్ ఇచ్చి అతనికి వార్నింగ్ ఇచ్చానని చెప్పింది. ఇక తాజాగా ఆమె నేహాదూపియా నిర్వహించే చిట్‌చాట్‌లో మాట్లాడుతూ, సౌత్‌లో పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. పారితోషికం బాగానే ఇస్తారు. కానీ సూపర్‌హీరోల డామినేషన్ అక్కడ ఎక్కువ. ఏదైనా హీరోతో సీన్ చేయాల్సివస్తే ఆ షూట్‌కి హీరోల కంటే రెండు గంటలు ముందుగా వెళ్లి షూటింగ్ స్పాట్‌లోఎదురు చూడాలి. నేను కెరీర్ స్టార్టింగ్‌లో సౌత్‌లో చేశాను. మొత్తం మీద చెప్పాలంటే బాలీవుడ్‌లో కంటే సౌత్‌లో హీరోయిన్లను తక్కువగా చూసి, హీరోలు తమ పెత్తనం, జులుం చేస్తారని ఇన్‌డైరెక్ట్‌గా తెలిపింది.