నందమూరి ఆర్ట్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే కళ్యాణ్ రామ్ తాను హీరోగా చేసే సినిమాలు మాత్రం లో అండ్ మీడియం బడ్జెట్ రేంజ్ లోనే ఉంటాయి. అలాగే కళ్యాణ్ రామ్ కి కెరీర్ లో చెప్పుకోదగ్గ బిగ్గెస్ట్ హిట్స్ అంటే రెండు మాత్రమే ఉన్నాయి. ఈ హీరోకి ఓ.. అన్నంత మార్కెట్ కూడా లేదు. కానీ ఇప్పుడు కళ్యాణ్ రామ్ మంచి లక్షణాలున్న అబ్బాయి (ఎమ్యెల్యే) తో ఒక భారీ హిట్ అందుకోవాలనే కసితో రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. కారణం కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ తో రొమాన్స్ చెయ్యడం.. ట్రైలర్, టీజర్స్, సాంగ్స్ అన్ని సినిమా మీద అంచనాలు పెంచేలా ఉన్నాయి.
మరి కొత్తగా న్యూ లుక్, న్యూ హెయిర్ స్టయిల్, డాన్స్ పరంగాను కళ్యాణ్ రామ్ కొత్తదనం చూపించడం వంటి అంశాలతో సినిమాపై ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ తోనే ఎమ్యెల్యే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒక రేంజ్ లో జరిగిందని అంటున్నారు. కళ్యాణ్ రామ్ ఎమ్యెల్యేకు ప్రీ రిలీజ్ బిజినెస్ తో దాదాపుగా 22 కోట్ల బిజినెస్ జరిగిందట. మరి ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 4.2 కోట్లకు, ఓవర్సీస్ లో 5 కోట్లకు అమ్ముడవడం విశేషంగా చెబుతున్నారు. మరి ఈ రేంజ్ లో కళ్యాణ్ రామ్ సినిమాకి బిజినెస్ అంటే అదిరిపోయిందనే చెప్పాలి. అలాగే కళ్యాణ్ రామ్, కాజల్, మనాలి రాధోడ్ తో పాటు డైరెక్టర్ ఉపేంద్ర కూడా ఎమ్యెల్యే ప్రమోషన్స్ విషయంలో ఒక రేంజ్ లో ఉన్నారు. మరి వీరు చేసే ఈ ప్రమోషన్స్ .. ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ ను తెచ్చిపెడతాయని అంతా భావిస్తున్నారు.