పాపం అనుష్క అనకుండా ఉండలేకపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన అనుష్క ప్రస్తుతం చేతిలో సినిమాలు లేవు... దానికి కారణం అనుష్క సినిమాలను ఒప్పుకోకపోవడమే. అయితే అనుష్క తన ఫిట్నెస్ మీద మాత్రం బాగా ఫోకస్ పెట్టింది. కానీ అనుష్క ఎన్నివిధాలుగా ట్రై చేసిన తాను అనుకున్న బరువుకు రాలేక నానా పాట్లు పడుతోంది. ఇక టాలీవుడ్ లో అనుష్క అనగానే లేడి ఓరియెంటెడ్ పాత్రలకు పెట్టింది పేరుగా చూస్తారు. మరి అనుష్క నటించిన లేడి ఓరియెంటెడ్ చిత్రాలు అలాంటి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి సినిమాల్లో అనుష్క నటన ఏ స్టార్ హీరో నటనకు తక్కువ కాదు.
కానీ భాగమతి సినిమా తర్వాత అనుష్క మాత్రం ఎటువంటి సినిమాని ఒప్పుకోవడంలేదు. ఏదో నాగార్జున - నాని మల్టీస్టారర్ లో నాగ్ పక్కన స్వీటీ నటిస్తుందనే న్యూస్ వినిపించినప్పటికీ అది ఫెక్ న్యూస్ అని తేలిపోయింది. అయితే ప్రస్తుతం అనుష్క భాగమతి తర్వాత ఒక తమిళ సినిమాని ఒప్పుకుంది. ఆ సినిమా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాని తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి తెలుగుతో సమానంగా అనుష్కకి తమిళంలోనూ క్రేజ్ ఉంది.
కాకపోతే ఈ సినిమా మొదలవ్వడానికి చాలా సమయం పడుతుండడంతో... అనుష్క ఇంకా తన బరువు మీదే కాన్సంట్రేట్ చేసింది. పూర్తిగా బరువు తగ్గి రెగ్యులర్ లుక్ లోకొచ్చాకే అనుష్క ఇతర ప్రాజెక్ట్ లను ఒప్పుకోవాలని అనుకుంటుంది. దానికోసం అటు కేరళ వైద్యంతోపాటు నేచురల్ గా బరువు తగ్గడానికి యోగా, జిమ్ వంటి వాటితో చాలా కష్టపడుతుంది అనుష్క.