ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sister Sentiment To Be Highlight In Naga Chaitnya Savyasachi

సవ్యసాచికి ఈ సెంటిమెంటే హైలైట్..!

Sister Sentiment To Be Highlight In Naga Chaitnya Savyasachi

నాగ చైతన్య పెళ్ళైన తర్వాత దూకుడు పెంచేశాడు. ఇప్పుడు ఒకేసారి ఇద్దరు డైరెక్టర్స్ తో కలిసి రెండు సినిమాలను చేస్తున్నాడు. అందులో ఒకటి చందు మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఉగాది సందర్భంగా విడుదలై సంచలనం సృష్టించింది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ హీరో మాధవన్ ఒక కేర్ రోల్ ప్లే చేస్తుండడం... మాజీ హీరోయిన్ భూమిక నాగ చైతన్యకి అక్క రోల్ ప్లే చేస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా మాస్ మసాలా యాక్షన్ థ్రిలర్ గా తెరకెక్కుతోంది.

అయితే ఈ సినిమా కథ మొత్తం సిస్టర్ సెంటిమెంట్ తోనే ఉండబోతోందట. చైతుకి అక్క పాత్రలో నటిస్తున్న భూమిక ఈ సినిమాకి కీ రోల్ అని... ఈ కథలో భూమికకు జరిగిన అన్యాయానికి తమ్ముడిగా నాగ చైతన్య పగతీర్చుకోవడం వంటి విషయాలతో సినిమా తెరకెక్కుతోందని అంటున్నారు. ఇక ఈ సిస్టర్ సెంటిమెంట్ సవ్యసాచి సినిమాకే హైలెట్ అని కూడా అంటున్నారు. మరి అక్కని కాపాడే ప్రయత్నంలో తమ్ముడిగా నాగ చైతన్య ఎదుర్కునే సమస్యలు లాంటివి ఈ సినిమాకి హైలెట్ అన్నమాట. మరి విలన్ గా నటిస్తున్న మాధవన్ కేరెక్టర్ తో పాటు... ఈ సినిమాలో రావు రమేష్ పాత్ర కూడా కొత్తగా ఉండబోతోందనే టాక్ వినబడుతుంది.

Savyasachi: Naga Chaitanya with his sister Bhumika Chawla

savyasachi
naga chaitanya
sister
bhumika chawla