Advertisementt

సవ్యసాచికి ఈ సెంటిమెంటే హైలైట్..!

Wed 21st Mar 2018 10:20 PM
savyasachi,naga chaitanya,sister,bhumika chawla  సవ్యసాచికి ఈ సెంటిమెంటే హైలైట్..!
Sister Sentiment To Be Highlight In Naga Chaitnya Savyasachi సవ్యసాచికి ఈ సెంటిమెంటే హైలైట్..!
Advertisement
Ads by CJ

నాగ చైతన్య పెళ్ళైన తర్వాత దూకుడు పెంచేశాడు. ఇప్పుడు ఒకేసారి ఇద్దరు డైరెక్టర్స్ తో కలిసి రెండు సినిమాలను చేస్తున్నాడు. అందులో ఒకటి చందు మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఉగాది సందర్భంగా విడుదలై సంచలనం సృష్టించింది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ హీరో మాధవన్ ఒక కేర్ రోల్ ప్లే చేస్తుండడం... మాజీ హీరోయిన్ భూమిక నాగ చైతన్యకి అక్క రోల్ ప్లే చేస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా మాస్ మసాలా యాక్షన్ థ్రిలర్ గా తెరకెక్కుతోంది.

అయితే ఈ సినిమా కథ మొత్తం సిస్టర్ సెంటిమెంట్ తోనే ఉండబోతోందట. చైతుకి అక్క పాత్రలో నటిస్తున్న భూమిక ఈ సినిమాకి కీ రోల్ అని... ఈ కథలో భూమికకు జరిగిన అన్యాయానికి తమ్ముడిగా నాగ చైతన్య పగతీర్చుకోవడం వంటి విషయాలతో సినిమా తెరకెక్కుతోందని అంటున్నారు. ఇక ఈ సిస్టర్ సెంటిమెంట్ సవ్యసాచి సినిమాకే హైలెట్ అని కూడా అంటున్నారు. మరి అక్కని కాపాడే ప్రయత్నంలో తమ్ముడిగా నాగ చైతన్య ఎదుర్కునే సమస్యలు లాంటివి ఈ సినిమాకి హైలెట్ అన్నమాట. మరి విలన్ గా నటిస్తున్న మాధవన్ కేరెక్టర్ తో పాటు... ఈ సినిమాలో రావు రమేష్ పాత్ర కూడా కొత్తగా ఉండబోతోందనే టాక్ వినబడుతుంది.

Sister Sentiment To Be Highlight In Naga Chaitnya Savyasachi:

Savyasachi: Naga Chaitanya with his sister Bhumika Chawla

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ