నేడు టాలీవుడ్‌లో బిగ్ స్టార్స్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు, ప్రభాస్, అల్లుఅర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్‌కి ఉన్నంత డిమాండ్, క్రేజ్‌ని సంపాదించుకున్న ఏకైక దర్శకునిగా రాజమౌళిని చెప్పుకోవాలి. ఇక ఈయన ఓ చిత్రం టీజర్, ట్రైలర్, ఫస్ట్‌లుక్ వంటి వాటి విషయంలో, సినిమా విడుదలైన తర్వాత సినిమా మీద చెప్పే అభిప్రాయంపై ఎందరో ప్రేక్షకులకు సరైన గురి ఉంది. అందుకే రాజమౌళి మెచ్చుకున్న చిత్రాలన్నీ దాదాపు మంచి సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ఇక ఈయన సుకుమార్, క్రిష్‌లంటే మరింత ఆప్యాయత ప్రదర్శిస్తారు. '1' (నేనొక్కడినే) చిత్రం తెలుగు రాష్ట్రాల ప్రజలకు సరిగా రీచ్‌కాలేదు. ఇందులోని కథ, కథనాలు, హై క్రియేటివిటీ అనేవి సగటు ప్రేక్షకులకు అర్ధం కాలేదు. అయినా సరే జక్కన్న ఆ చిత్రానికి సపోర్ట్‌గా నిలిచి ఏకంగా సుకుమార్‌ని ఆ చిత్రం విషయంలో ఇంటర్వ్యూ కూడా చేసి తనవంతు ప్రయత్నం చేశాడు. కానీ సినిమా ఆడలేదు. ఇక ఇటీవల ఇతను ప్రస్తుతం రాబోయే చిత్రాలలో తాను ఎక్కువగా ఎదురుచూస్తోంది సుకుమార్, రామ్‌చరణ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న 'రంగస్థలం 1985' గురించే అని ఆల్‌రెడీ ఫస్ట్‌లుక్ రిలీజ్ సందర్భంగా చెప్పేశాడు.
ఇక తాజాగా 'రంగస్థలం 1985' నుంచి విడుదలైన థియేటికల్ ట్రైలర్‌ని చూసిన ఆయన మరోసారి ఎంతో పాజిటివ్‌గా, ప్రేక్షకుల్లో ఆసక్తిరేకెత్తే విధంగా మాట్లాడారు. ఈ మాటలు ఈ చిత్రం ప్రమోషన్స్‌కి బాగా ఉపయోగపడతాయనే చెప్పాలి. అందునా రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో కలిసి చేయనుండటంతో కూడా రామ్‌చరణ్‌పై రాజమౌళి ఎక్కువ మక్కువ చూపిస్తున్నాడు. ఆయన మాట్లాడుతూ, చిట్టిబాబు నాకు మరింత దగ్గరయ్యాడు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆయనపై నాకున్న ఆప్యాయత మరింతగా పెరిగింది. జగపతిబాబు పాత్ర కూడా ఎంతో బాగుంది. ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నానని స్పందించాడు. ఇక రాజమౌళి ఈ చిత్రం విడుదలయ్యే వరకు, విడుదలైన తర్వాత కూడా దీనికి తన వంతు ప్రమోషన్స్ ఖచ్చితంగా చేస్తాడని చెప్పవచ్చు. ఇక మెగాహీరోలు, మెగాభిమానులు, రాజమౌళి వంటి వారు ఈ చిత్రం ట్రైలర్‌ని చూసి ఎంతో అద్భుతం అని అంటున్నా, అల్లుఅర్జున్ మాత్రం ఇప్పటి వరకు అసలు ఆయన స్పందించకపోవడం మెగాభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది.