టాలీవుడ్ లో ఇంకా టాప్ చైర్ లోనే కొనసాగుతుంది సమంత. తనతో పాటు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్, తమన్నా లాంటి వాళ్ళు అవకాశాలు కోసం ఎదురుచూస్తుంటే సమంతకి మాత్రం చేతినిండా అవకాశాలే. నాగ చైతన్యని పెళ్లాడిన ఈ భామకు అస్సలు డిమాండ్ తగ్గలేదు. ఎందుకంటే టాలీవుడ్ లో గ్లామర్ పాత్రల నుండి డి గ్లామర్ పాత్రలు, అలాగే 'రాజుగారి గది 2' లో అయితే ఆత్మలా సమంత నటన సినిమాకే హైలెట్. ఎలాంటి పాత్ర అయినా అలవోకగా ఆకళింపు చేసుకుని నటిస్తుంది. అందుకే సమంతకి భారీ డిమాండ్.. ఇప్పటికి కోలీవుడ్, టాలీవుడ్స్ లో సమంత టాప్ రేంజ్ లోనే ఉంది.
ప్రస్తుతం 'రంగస్థలం'లో డి గ్లామరస్ పాత్రలో రామలక్ష్మి లా అదరగొడుతున్న సమంత, 'మహానటి' సినిమా షూటింగ్ లో కూడా బిజీగా వుంది. అయితే నిన్నటిదాకా 'రంగస్థలం' షూటింగ్ లో బిజీగా క్షణం తీరిక లేకుండా గడిపిన సామ్ ఇప్పుడు 'మహానటి' షూటింగ్ లో కూడా అంతే గ్యాపు లేకుండా షూటింగ్ లో పాల్గొని తన పార్ట్ షూటింగ్ ని కంప్లీట్ చేసింది. అయితే హీరో హీరోయిన్స్ సీన్ కి సీన్ కి మధ్యన ఏ గొడుగు కిందో, ఏ కార్ వ్యాన్ లోనో కాస్త రెస్ట్ తీసుకుంటుంటారు. అందరి సంగతి ఏమో గాని సమంత మాత్రం 'మహానటి' షూటింగ్ గ్యాప్ లో ఒక అసిస్టెంట్ గొడుగు పట్టుకుంటే కుర్చీలో కూర్చుని మరో చైర్ మీద కాళ్లు పెట్టుకుని రిలాక్స్ అవుతూ కనబడుతుంది.
మరి అలా రిలాక్స్ అవుతూ సమంత చిరునవ్వుతో కనబడుతున్న ఆ ఫోటోలోని సమంతని చూస్తుంటే మాత్రం అబ్బా సమంత సింపుల్ చీర కట్టులో ఎంతందంగా.... ఎంత సింపుల్ గా ఉందో అనకుండా ఉండలేము. అలాగే ఆ కుర్చీలో సమంత ఒక కునుకు తీస్తుంది కూడా. మరి ఆమె అసిస్టెంట్స్ మాత్రం సామ్ కి నిద్రా భంగం కలగకుండా అక్కడే కాచుకుని కూర్చున్నారు. మరి సమంత రిలాక్స్డ్ ఫోటోని మీరు ఓ లుక్కేయండి.