తెలుగు సినిమాలోని పాటలు, డ్యాన్సుల రూపురేఖలను మార్చి వేసి డిస్కో, బ్రేక్‌డ్యాన్స్, షేక్ డ్యాన్స్ వంటి వాటి ద్వారా సంచలనం సృష్టించిన స్టార్‌గా చిరంజీవిని చెప్పుకోవాలి. ఆయన మెగాస్టార్ కావడంలో పాటల్లోని స్టెప్స్, ఫైట్ యాక్షన్ సీన్స్‌లో ఆయన చూపించే కొత్తదనమే ఆయనకు అంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి కారణంగా చెప్పవచ్చు. ఇక డ్యాన్స్ అనేది కష్టపడితే ఎవరైనా నేర్చుకుని చేస్తారు. కానీ చేసే, వేసే స్టెప్పు రిథమిక్‌గా, స్టైలిష్‌గా, కొత్తగా అందరిచేత ఉర్రూతలూగించేలా చేయడమే ఆయన ప్రత్యేకత. 'పసివాడిప్రాణం, జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్'లలో బ్రేక్, షేక్‌ని డ్యాన్స్‌ని పరిచయం చేసిన చిరు 'ఇంద్ర' చిత్రంలో చేసిన వీణ స్టెప్పు, ఇక 'ముఠామేస్త్రి'లోని మార్కెట్‌లో సాగే టైటిల్ సాంగ్‌లో ఆయన చూపించిన స్టైల్ ఎవ్వరికీ రాదు. ఇక సీనియర్ స్టార్స్‌లో చిరంజీవిని పక్కనపెడితే యంగ్‌స్టార్స్‌లో పవన్, మహేష్, ప్రభాస్ వంటి వారికంటే జూనియర్ ఎన్టీఆర్, అల్లుఅర్జున్, రామ్‌చరణ్‌లను ప్రముఖంగా చెప్పుకోవాలి. వీరితో పాటు రామ్ డ్యాన్స్‌లు కూడా ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటాయి. ఇక వీరిలో చిరంజీవి తర్వాత స్టైలిష్‌గా డ్యాన్స్ చేయడం అల్లుఅర్జున్‌కి అబ్బింది. ఆయన చిత్రాలలో హీరోయిన్ అవకాశం వస్తే హీరోయిన్లు ఎంత సంతోష పడతారో ఆయనకు ధీటుగా స్టెప్పులు వేయగలమా? అని మరింత భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్‌లో బన్నీరిథమ్, స్పీడు అందుకోవడం అంత సులభం కాదు.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం అల్లుఅర్జున్ రచయిత వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ 'నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా' అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో అనుఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, యాక్షన్‌కింగ్ అర్జున్, శరత్‌కుమార్, నదియా, వెన్నెల కిషోర్, బొమ్మన్ ఇరానీ, రావు రమేష్ వంటి వారు నటిస్తున్నారు. మే 4న విడుదల కానున్న ఈ చిత్రాన్ని శ్రీరామలక్ష్మి పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తుండగా, బన్నీవాసు, నాగబాబులు కో ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్-శేఖర్‌లు బాణీలు అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు మలయాళం, హిందీలలో కూడా ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రమ్ ఓ పాటలో చేస్తోంది. ఈమె మాట్లాడుతూ, బన్నీ గ్రేట్ డ్యాన్సర్. నేను ఆయన డ్యాన్స్‌కి వీరాభిమానిని. ఆయనతో కలసి నటించడం ఎంతో ఆనందంగా ఉంది అని చెబుతూనే ఇది ఐటం సాంగ్ కాదని చెప్పింది. మొత్తానికి ఈ చిత్రంలో ఈ పాట ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది? ఆమె బన్నీ సరసన ఎంత వరకు మెప్పిస్తుందో వేచిచూడాల్సివుంది...!