ఈమధ్య సొంతగా కమల్‌హాసన్ రాజకీయ పార్టీ పెట్టి రామేశ్వరంలోని మాజీరాష్ట్రపతి, మిస్సైల్‌మేన్ అబ్దుల్‌కలాం ఇంటి నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. ఇక మధురైలో బహిరంగ సభని నిర్వహించాడు. ఈ సభకి ఆయన రజనీకాంత్‌ని కూడా ఆహ్వానించాడు. ఇక ఇలా రాజకీయాలలోకి రాకముందే ఆయన రజనీని షూటింగ్‌లో కలుసుకుని పలు విషయాలు పర్సనల్‌గా చర్చించానని తెలిపాడు. ఇక రజనీ, కమల్‌లు మంచి స్నేహితులు కావడంతో ఈ ఇద్దరి మద్య పొత్తు ఉన్నా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు భావించారు. దీనిపై రజనీ, కమల్‌లు తాము మంచి మిత్రులమేనని, తమని తాము విమర్శించుకోకుండా రాజకీయాలలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. అయితే ఇప్పుడు ఇలాంటి వార్తలకు కమల్ ఫుల్‌స్టాప్ పెట్టాడు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. రజనీతో నేను కలిసే ఉద్దేశ్యం నాకు లేదు. రజనీది ఆధ్యాత్మిక పార్టీ... నాది లౌకిక వాద పార్టీ. మా రెండు పార్టీల మార్గాలు వేరువేరు.
రాజకీయాల కారణంగా రజనీ వంటి స్నేహితుడితో స్నేహాన్ని వదులుకోవడం నాకు కూడా బాధగానే ఉంది. మా మధ్య అభిప్రాయ బేధాలు వచ్చిన విషయం వాస్తవమే. రాజకీయాలలో రజనీ ఎలాంటి లక్ష్యాలు నిర్ణయించుకున్నాడో నాకు తెలియదు. నాకు మతాలన్నీ ఒకటే. ఆధ్యాత్మిక రాజకీయాలపై నాకు నమ్మకం లేదు. సినిమాలలో స్నేహాన్ని రాజకీయాలలో కూడా ఆశించలేం. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే స్థితి మాత్రం రాకూడని కోరుకుంటున్నాను. మా మధ్య ఇప్పటికే దూరం పెరిగింది. అది మరింతగా పెరుగుతుందని అనిపిస్తోంది. గతంలో ఉన్న అనుబంధాన్నితలుచుకుని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే బాధగా అనిపిస్తోందని చెప్పాడు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఇలా చూసుకుంటే రజనీ, కమల్‌ల మధ్య ఎలాంటి పొత్తు ఉండదని తేలిపోవడమే కాదు... కమల్ వామపక్షాలు, డీఎంకే వంటి హేతువాద పార్టీలతో జత కట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లి ధ్యానంలో ఉండటం విశేషం.